వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు: బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి

కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి): కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని , అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బిజెపి కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రవీణ్ రావు మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం , స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా భారీగా నిధులు కేటాయించారన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ తో పాటు 36 రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ పై కస్టం డ్యూటీ నుంచిమినహాయించడంతో వాటికి సంబంధించిన మందులు ఇకపై చౌకగా లభిస్తాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన మందులు చౌకగా లభించే విధంగా బడ్జెట్లోకేటాయింపులు జరపడం శుభపరిణామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పుధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం, పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం , గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చారిత్రకమైందని, బడ్జెట్ కేటాయింపులన్నీ అన్ని వర్గాలకు, పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఉచితాల పేరుతో ప్రజలను మాయ చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు మింగుడు పడడం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రతిపక్షాలకు , కొన్ని వర్గాలకు భయం కలిగించిందని, అమెరికా డీప్ స్టేట్, చైనా,పాకిస్తాన్ సోనియా, రాహుల్,కమ్యూనిస్టులు,మావోయిస్టులు ,అర్బన్ నక్సల్స్, నేరగాళ్లు, మాఫీయా లకు దేశం అంటే ద్వేషం నింపుకున్న ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ బడ్జెట్ భయపెట్టిందన్నారు. 12 లక్షల వరకూ ఇన్కమ్ టాక్స్ లేదని తెలిసిన కోట్లాదిమంది ప్రజలు ఆనందంలో ఉంటే , ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దుఃఖంలో ఉన్నాయన్నారు . ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు కుంట తిరుపతి, జవాజి రమేష, కోమటిరెడ్డి ఆంజనికుమార్, సోమినేనికర్ణాకర్ , బైరెడ్డి వంశీ, ఇల్లందుల ఆనంద్, రంజిత్ గౌడ్, అనిల్, మల్లేశం యువమోర్చా అధ్యక్షులు ప్రశాంత్ పాల్గొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు: బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి

కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి):
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని , అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బిజెపి కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రవీణ్ రావు మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం , స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా భారీగా నిధులు కేటాయించారన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ తో పాటు 36 రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ పై కస్టం డ్యూటీ నుంచిమినహాయించడంతో వాటికి సంబంధించిన మందులు ఇకపై చౌకగా లభిస్తాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన మందులు చౌకగా లభించే విధంగా బడ్జెట్లోకేటాయింపులు జరపడం శుభపరిణామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పుధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం, పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం , గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చారిత్రకమైందని, బడ్జెట్ కేటాయింపులన్నీ అన్ని వర్గాలకు, పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఉచితాల పేరుతో ప్రజలను మాయ చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు మింగుడు పడడం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రతిపక్షాలకు , కొన్ని వర్గాలకు భయం కలిగించిందని, అమెరికా డీప్ స్టేట్, చైనా,పాకిస్తాన్ సోనియా, రాహుల్,కమ్యూనిస్టులు,మావోయిస్టులు ,అర్బన్ నక్సల్స్, నేరగాళ్లు, మాఫీయా లకు దేశం అంటే ద్వేషం నింపుకున్న ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ బడ్జెట్ భయపెట్టిందన్నారు. 12 లక్షల వరకూ ఇన్కమ్ టాక్స్ లేదని తెలిసిన కోట్లాదిమంది ప్రజలు ఆనందంలో ఉంటే , ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దుఃఖంలో ఉన్నాయన్నారు . ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు కుంట తిరుపతి, జవాజి రమేష, కోమటిరెడ్డి ఆంజనికుమార్, సోమినేనికర్ణాకర్ , బైరెడ్డి వంశీ, ఇల్లందుల ఆనంద్, రంజిత్ గౌడ్, అనిల్, మల్లేశం యువమోర్చా అధ్యక్షులు ప్రశాంత్ పాల్గొన్నారు.

About The Author