మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ఎంపీ వద్దిరాజు దిగ్భ్రాంతి

ఖమ్మం బ్యూరో, భారత శక్తి : మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. కోట్లాది మంది హాజరయ్యే ఇటువంటి సందర్భాలలో తొక్కిసలాటలు, అవాంఛనీయమైన దుర్ఘటనలు సంభవించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం తీవ్ర విచారకరమని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. తొక్కిసలాటలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని వెంటనే ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

About The Author