
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన అధికారి ప్రవీణ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు. నిర్వహించారు. బదిలీపై భైంసాకు చేరుకున్న ప్రవీణ్, అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు భైంసా సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన శ్రీలత బదిలీతో ఆదిలాబాద్‌కి వెళ్లారు. ఈ సందర్భంలో కార్యాలయ సిబ్బంది కొత్త అధికారి ప్రవీణ్‌ను ఆత్మీయంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. తరువాత భైంసా సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ మాట్లాడుతూ, “భైంసా ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా, అవినీతి రహిత సేవలు అందించేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు. స్థానిక ప్రజల సహకారంతో ఉత్తమ సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.