సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి
- ఫిర్యాదుదారుల నుండి ప్రత్యక్షంగా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి :
:
జిల్లా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు,జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విని, సమస్యలు తలెత్తడానికి గల కారణాలపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓ లతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాది సమస్యను ఓపీగా విని, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తూ.. బాధితులకు బాసటగా నిలవాలని ఎస్.హెచ్.ఓ లకు సూచనలు చేశారు.జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పరిష్కారం దొరకనప్పుడు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదు పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
