ఇంకా టిక్కెట్‌ ఆశలు…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 పటాన్‌చెరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదే టికెట్‌ కోసం పోటీ పడుతున్న చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌, బిఆర్‌ఎస్‌ యువ నాయకుడు నీలం మధు పట్టు విడవకుండా ప్రయత్నాలు కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పటాన్‌చెరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదే టికెట్‌ కోసం పోటీ పడుతున్న చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌, బిఆర్‌ఎస్‌ యువ నాయకుడు నీలం మధు పట్టు విడవకుండా ప్రయత్నాలు కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.తన ప్రయత్నానికి కొనసాగింపుగా, నీలం మధు యువసేన శనివారం భారీ పాదయాత్ర చేపట్టనుంది. పటాన్‌చెరు పట్టణంలోని అంబెడ్కర్‌ విగ్రహం నుండి, బీరంగూడలోని మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగు తుంది. సుమారు 12 కిలోవిూటర్లు సాగనున్న పాదయాత్రలో, పదివేలమంది యువత నియాజకవర్గంలోని అన్ని మండలాల నుండి మధుకి మద్దతుగా పాల్గొననున్నారు.నీలం మధుని ఎమ్మెల్యే అబ్యర్దిగా ప్రకిటించాలని డిమాండ్‌ చేస్తూ యాత్ర చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే మహిపాల్‌ రెడ్డి ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ నీలం మధు అనుచరులు నియోజకవర్గం మొత్తం నిత్యం ఎదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ, మధుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి అని తమ ప్రయత్నం కొనసాగిస్తున్నారు.ముదిరాజు సామాజికవర్గం నుండి బిఆర్‌ఎస్‌ ఒక్కరికి కూడా రాష్ట్రంలో టికెట్‌ ఇవ్వలేదని మధు కి టికెట్‌ ఇస్తే ఈ సామాజికవర్గం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. పార్టీ జిల్లా బాద్యులైన, మంత్రి హరీష్రావు.. నీలం మధుని, మహిపాల్‌ రెడ్డి ని ప్రగతి భవన్‌ కు పిలిచి ఇద్దరిని కలిపి మాట్లాడారు.మధుకి తప్పకుండ తగిన న్యాయం చేస్తామని హావిూ ఇచ్చిన హరీష్‌ రావు, ఈ సారి మహిపాల్‌ రెడ్డి విజయంకోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అయినా మధు వెన్నక్కి తగ్గకపోవడం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి మాత్రం నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ, అభివృద్ధి పనులను పార్టీ కార్యకలాపాల్లోని చురుకుగా పాల్గొంటున్నారు.మిగతా ముదిరాజ్‌ సామజిక వర్గం నుండి వచ్చే నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, మధుకి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీలోనే ఉంటాడా, లేకపోతె కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేస్తాడా అనేది నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా టిక్కెట్‌ ఆశలు…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30
పటాన్‌చెరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదే టికెట్‌ కోసం పోటీ పడుతున్న చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌, బిఆర్‌ఎస్‌ యువ నాయకుడు నీలం మధు పట్టు విడవకుండా ప్రయత్నాలు కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పటాన్‌చెరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదే టికెట్‌ కోసం పోటీ పడుతున్న చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌, బిఆర్‌ఎస్‌ యువ నాయకుడు నీలం మధు పట్టు విడవకుండా ప్రయత్నాలు కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.తన ప్రయత్నానికి కొనసాగింపుగా, నీలం మధు యువసేన శనివారం భారీ పాదయాత్ర చేపట్టనుంది. పటాన్‌చెరు పట్టణంలోని అంబెడ్కర్‌ విగ్రహం నుండి, బీరంగూడలోని మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగు తుంది. సుమారు 12 కిలోవిూటర్లు సాగనున్న పాదయాత్రలో, పదివేలమంది యువత నియాజకవర్గంలోని అన్ని మండలాల నుండి మధుకి మద్దతుగా పాల్గొననున్నారు.నీలం మధుని ఎమ్మెల్యే అబ్యర్దిగా ప్రకిటించాలని డిమాండ్‌ చేస్తూ యాత్ర చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే మహిపాల్‌ రెడ్డి ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ నీలం మధు అనుచరులు నియోజకవర్గం మొత్తం నిత్యం ఎదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ, మధుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి అని తమ ప్రయత్నం కొనసాగిస్తున్నారు.ముదిరాజు సామాజికవర్గం నుండి బిఆర్‌ఎస్‌ ఒక్కరికి కూడా రాష్ట్రంలో టికెట్‌ ఇవ్వలేదని మధు కి టికెట్‌ ఇస్తే ఈ సామాజికవర్గం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. పార్టీ జిల్లా బాద్యులైన, మంత్రి హరీష్రావు.. నీలం మధుని, మహిపాల్‌ రెడ్డి ని ప్రగతి భవన్‌ కు పిలిచి ఇద్దరిని కలిపి మాట్లాడారు.మధుకి తప్పకుండ తగిన న్యాయం చేస్తామని హావిూ ఇచ్చిన హరీష్‌ రావు, ఈ సారి మహిపాల్‌ రెడ్డి విజయంకోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అయినా మధు వెన్నక్కి తగ్గకపోవడం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి మాత్రం నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ, అభివృద్ధి పనులను పార్టీ కార్యకలాపాల్లోని చురుకుగా పాల్గొంటున్నారు.మిగతా ముదిరాజ్‌ సామజిక వర్గం నుండి వచ్చే నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, మధుకి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీలోనే ఉంటాడా, లేకపోతె కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేస్తాడా అనేది నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.

About The Author