వసతి గృహాల్లో విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలి
- నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు
- రాష్ట్ర షెడ్యూల్ కులాలు, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ సాధికారిక శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్....

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కో ఆర్డినేటర్లు, ఎస్సి కార్పోరేషన్ ఈడీలతో వసతి గృహాలు నిర్వహణ, సౌకర్యాలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు ద్వారా ప్రతినెల వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి హాస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించి విద్యార్థులతో మమేకమై డైట్, మెనూ, సంరక్షణ పాటించేలా చూడాలని సూచించారు. ప్రతి హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీ-టీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వసతి గృహాల్లో సౌకర్యాలు, డైట్ కాస్మెటిక్ చార్జీల పర్యవేక్షణకు మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.
వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరిస్, సత్య శారద, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటిడిఎ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సి అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి శ్రీధర్, ఎస్సి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంతు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పిఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
