రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో తుఫాను ప్రభావo

జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలలి - జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ.

WhatsApp Image 2025-10-27 at 7.36.29 PM

భూపాలపల్లి : 

Read More సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

జిల్లా కలెక్టర్ ఐడిఓసి కార్యాలయంలో దాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు మరియు తుఫాను ప్రభావం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శల్ తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ రామకృష్ణా రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.

Read More పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

అనంతరం రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, వ్యవసాయ, సహకార, డిఆర్డీఓ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాను ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు.

Read More గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ శాఖలకు వివిధ నిధులు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 1.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే, నవంబర్ మొదటి వారం నుండి ధాన్యం మార్కెట్‌లోకి రావచ్చని అంచనా దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సన్నద్దంగా ఉండాలని  తెలిపారు.

Read More రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి

వాతావరణ శాఖ సూచనల మేరకు తుఫాను ప్రభావం ఉన్నందున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని  పేర్కొన్నారు.రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అలాగే ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More నేటి భారతం

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాలకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి సునిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

About The Author