ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

WhatsApp Image 2025-11-24 at 6.17.58 PM

వేములవాడ : 
ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోని సగ్గు లావణ్య- శ్రీనివాస్ లు నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని సోమవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. ఈ గృహ ప్రవేశానికి  రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ముఖ్య అతిథిగా హాజరై గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు. 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

​సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.. 

Read More తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో నూతన ఇంటిలోకి ప్రవేశించిన లబ్ధిదారులు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి ఉన్న తమ సొంతింటి కలను కేవలం కొన్ని నెలల కాలంలోనే ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందని ఆనందం వ్యక్తం చేశారు.తమ కలను సాకారం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు."ఇంత గొప్ప పథకం ద్వారా మా జీవితాల్లో వెలుగులు నింపినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాకే ఎన్నో ఏండ్లు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు.ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో కీలకమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసం కలిగి, సంతోషంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి,మాజీ ఎంపిటిసి నాగుల రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల విష్ణు, నాయకులు సయ్యద్ సాబిర్,దుర్గం పర్షయ్య, ఇర్ఫాన్, నాగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

Read More మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

About The Author