ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ దుబ్బాకలో అడ్మిషన్లు ప్రారంభం

- అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ కనకయ్య

ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ దుబ్బాకలో అడ్మిషన్లు ప్రారంభం

దుబ్బాక:

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) / అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ), దుబ్బాకలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సంస్థ ప్రిన్సిపాల్ జి. కనకయ్య తెలిపారు. ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులు ఐటీఐ/ఏటీసీలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతినెల రూ.2,000 స్కాలర్‌షిప్ అందజేస్తుందని తెలిపారు.సంస్థలో అనుభవజ్ఞులైన బోధకులచే నాణ్యమైన శిక్షణతో పాటు ఆధునిక యంత్ర సామగ్రితో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించబడుతుందని వివరించారు. శిక్షణ పూర్తైన అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రభుత్వ ఐటీఐ–అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, దుబ్బాక కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఆఫీసర్ పి. యాదగిరి, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు పీరాజీ, రాజు, అతిఫ్, సాయి, భరత్, రక్షిత్, శశిధర్, సురేష్, కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-08 at 19.24.09 (1)

About The Author