మధ్య తరగతి, పేద ప్రజలకు గుదిబండగా ధరలు..

- చాలీ చాలని సంపాదన.. పెరుగుతున్న ధరలతో యాతన..
- ఎందుకు ధరలు పెరుగుతున్నాయో తెలియని అయోమయం.. 
- అర్ధాకలితో పూట గడుపుతున్నామంటూ ఆవేదన.. 
- అప్పులు చేసైనా సరే సరుకులు కొనక తప్పని పరిస్థితి.. 
- జీతంతో జేబులు కూడా నిండటంలేదు.. ధరలు అందడం లేదు.. 
- ఎక్కడ చూసినా ఇవే చర్చలు.. ఎటూ తప్పించుకోలేని అంశాలు.. 
- ఒక సామాన్య ఇల్లాలిని కదిలిస్తే కన్నీటి గాధలే కనిపిస్తాయి.. 
- ధరల పెరుగుదలతో పాటు నకిలీ వస్తువులు మరింత దెబ్బ తీస్తున్నాయి.. 
- పెరగడం అన్నది కామన్ పాయింట్ గా మారిపోవడం దేనికి సంకేతం..? 
- ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనం.. 
 
 
ఆకలి, చిన్న చిన్న అవసరాలు.. వీటిని తప్పించుకోలేము.. అలాగని వదిలేయలేము.. సగటు మనిషి జీవన యాత్రలో ఇవి సర్వసాధారం అయిపోయాయి.. నిత్యావసరం మోయలేని భారమైపోయి కుంగదీస్తోంది.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ధరలు తగ్గుతాయేమో అని ఆశగా ఎదురు చూడటం.. నిరాశకు గురి అవడం సామాన్యుల వంతు అవుతోంది.. ఓట్లు వేయడం తప్ప ఎందుకూ పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతూనే ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తాయో రావో తెలియదు కానీ మధ్య తరగతి, పేదవారి పరితిత్తుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు.

హైదరాబాద్, ఆగస్టు 03 ( భారత శక్తి ) : గత రెండు మూడేళ్ళుగా పేద, మధ్య తరగతి వర్గాలను ఎవర్ని కదిలించినా, పది మాటల్లో కనీసం రెండు మూడైనా పెరిగిన ధరల గురించే ఉంటున్నాయి. పెట్రోల్, వంట నూనె, కరెంట్ బిల్, పాల ప్యాకెట్.. వస్తువు ఏదైనా పెరుగుదల అనే పాయింట్ మాత్రం కామన్ గా ఉంటోంది.. తినడమూ, ఖర్చు పెట్టడమూ ఎవరమూ మానుకోలేము.. మరి ఈ అంశంపై ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? ఒకసారి చూద్దాం.. 
1000463795
 
ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకుండా, ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలి దగ్గర కూర్చుని ధరల పెరుగుదల ఆమెను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేశామనుకోండి.. ఆమె చెప్పే మాటలు కన్నీళ్లు తెప్పిస్తాయి.. రాజకీయ నాయకులు తరచూ మాట్లాడే మాటలు, చేసే ధర్నాలు, గ్యాస్ సిలిండర్లు నెత్తిన పెట్టుకుని, ఎడ్ల బండిపై వెళుతూ చేసే ప్రదర్శనలన్నీ ఒకవైపు.. ఆర్టీసీ బస్సులో కూర్చునో, బైక్ పై వెళ్తూనో, షేర్ ఆటోలో నుంచి తొంగి చూసి ఆ ఆందోళనకు కారణం తెలుసుకుని నిట్టూర్చే మధ్య తరగతి, పేదలు మరోవైపు ఊగిసలాడుతున్నారు.. 
 
అసలు ఈ ధరల పెరుగుదల అనే అంశం సామాన్య కుటుంబాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఒకసారి చూస్తే.. ఈ విషయం కోసం ఒక కేస్ స్టడీగా హైదరాబాద్ నగరంలోని మధ్యతరగతి మహిళతో మాట్లాడితే.. ఆమె ఒక ప్రైవేటు స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. మీడియా వారు ఆమెతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన ధరల్లో మీకు అనుభవంలోకి వచ్చిన ధరల్లో కాస్త వ్యత్యాసం ఉండవచ్చు. స్థలం, కాలంతో పాటూ బ్రాండ్స్ కూడా ఆ వ్యత్యాసానికి కారణం కావచ్చు అన్నది తెలిసిపోతుంది.. 
 
1000463796
ఇక కరోనా మహమ్మారి తాండవం చేసిన సమయం చాలా కష్టంగా గడిచింది. ఎందుకంటే ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ కావడంతో ఏడాదిన్నర పాటూ అసలు ఆమెకు జీతమే లేదు. ఆ తరువాత ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాక సగం జీతమే వస్తూ ఉండేది.. ఇప్పుడు కాస్త ఫర్వాలేదనిపించే పరిస్థితి ఉంది. ప్రతీ నెలా పూర్తి జీతం కాకపోయినా, గతం అంత దుర్భరంగా లేదు ప్రస్తుత పరిస్థితి. తన భర్తకు కరోనా సమయంలో సగం జీతం వచ్చింది అని తెలిసింది.. .
 
ధరల గురించి కదిలించినప్పుడు సుదీర్ఘంగా ఒక మహిళ చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.. ధరల పెరుగుదల అనగానే అందరి నుంచి వచ్చే మొదటి మాట నూనె ప్యాకెట్. అవును ఇప్పుడు ఈ విషయం భారతదేశాన్ని కుదిపేస్తోంది.. మధ్య తరగతిని బాణీలో వేయించుకుని తింటోంది వంట నూనే.
 
1000463799
''ధరలు అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఆయిల్. ఆయిల్ రేట్ 2019 ప్రాంతంలో సుమారుగా 90 రూపాయలు ఉండేది. తరువాత 120 అయింది. ఇప్పుడు రూ. 220 వరకూ పెరిగింది. అది మామూలు పెరుగుదల కాదు. అసలు వంట నూనె ఇంత భారీగా పెరగడం మాటలు కాదు. ఎంత పెరిగినా ఆయిల్ వాడడం తప్పదు కదా.. కానీ అత్యంత దుర్భరమైన విషయం ఏమిటంటే చెంచాలో సగం నూనె వాడుతున్న వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు.. ఇక తక్కువ ధరకు వస్తుందని చవక రకం నూనెలు వాడడం మొదలుపెట్టిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.. దారుణం ఏమిటంటే వంట నూనె ధరలు డబుల్ కంటే ఎక్కువ పెరగడంతో ఒక సామాన్యురాలైన గృహిణి కిరాణా షాపు బడ్జట్ తలకిందులై పోతోంది.. 
 
ధరలు పెరిగినా, నూనె బ్రాండ్ మార్చే సాహసం చాలా మంది చేయలేరు.. ఎందుకంటే నూనె గుండె జబ్బులకు డైరెక్ట్ లింకు అని మధ్య తరగతి వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. కానీ పేదల పరిస్థితి అలా కాదు. చాలా పేద కుటుంబాలు నూనె ప్యాకెట్లు కొనే సాహసం చేయలేరు.. చిన్న కిరాణా షాపుల్లో వంద గ్రాములు, 50 మిల్లీ లీటర్లు ఇలా కొంటూ ఉంటారు. వారు షాపులకు వెళ్లి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా నూనె అడిగితే, షాపు యజమానులు చిన్న చిన్న పాలిథిన్ కవర్లలో వంట నూనె అమ్ముతారు. ఇలాంటి కుటుంబాలపై నూనె ధరల పెరుగుదల ప్రభావం ప్రస్తుతం ఇంకా ఇంకా పెరిగిపోతోంది.. 
 
ఇలా కేవలం వంట నూనే కాదు, ఇంధన నూనెలు.. అంటే పెట్రోల్ కూడా పేద, మధ్య తరగతి కొంప ముంచాయి. చాలా కాలం నగరంలో ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడానికి బస్ టికెట్ 10 నుంచి 11 రూపాయల ఉండేది. ఇప్పుడు 30 రూపాయలు దాటింది. షేర్ ఆటోల సంగతి చెప్పక్కర్లేదు. పెట్రోల్ రేటు గురించి రోజూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. 
1000463797
 
''మూడేళ్ల క్రితం 75-80 రూపాయలు ధర ఉన్న పెట్రోలు. ఇప్పుడు రూ. 110 అయింది. వాస్తవానికి 120 అయితే, మొన్నామధ్య పెంచి మళ్లీ 10 రూపాయలు తగ్గించారు.. ఈ లెక్కన ఏకంగా మూడేళ్లలో 30 రూపాయల పైన పెట్రోల్ పెరిగింది. ఒక కుటుంబాన్ని ఒక్క బండి వుంటుండేది.. కానీ పిల్లలు పెరిగి పెద్ద అయిన తరువాత వాళ్ళు కూడా బైక్స్ నడుపుతారు.. దీంతో బడ్జెట్ ఎంత పెరిగిపోతుందో అర్ధం చేసుకోవచ్చు.. ఒకప్పుడు 2 వేల నుంచి రెండున్నర వేలలో పెట్రోల్ ఖర్చు అయిపోయేది. కానీ ఇప్పుడు సుమారు ఆరు వేల పైచిలుకుగా ఉంటోంది..  
 
పెట్రోల్ ధరలు ఒక సామాన్య కుటుంబంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపితే, డీజిల్ ధరలు పరోక్షంగా ప్రభావం చూపింది. డీజిల్ పెరుగుదలతో ఆటో చార్జీలు పెరిగాయి. సరుకు రవాణా ఖర్చు పెరుగుతుంది కాబట్టి, సరుకుల ధరలూ పెరిగాయి. అన్నీ కలిపి కుటుంబ బడ్జెట్ పెరిగిపోయింది.. ఈ పరిస్థితుల్లో సామాన్య, పేదల బ్రతుకులు ఏ విధంగా తెల్లారుతాయో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది..
 

About The Author