రాష్ట్రస్థాయి జానపద భజన పోటీల్లో శ్రీరామ కోలాట బృందం కి మొదటి స్థానం
తిరుపతి జిల్లా ప్రతినిధి, ఆగష్టు18(భారత శక్తి):
తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన శ్రీమతి పరస కస్తూరమ్మ ఐదవ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, కళాకారులకు రాష్ట్రస్థాయి భజన పోటీలు నిర్వహించారు. భజన పోటీలలో వివిధ జిల్లాల నుండి 15 టీములు పాల్గొనగా తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీలోని గురువు చికోలు నారాయణదాసు, డప్పు వాయిధ్య మాస్టర్ సుందర్ కుమార్ వారి శ్రీరామ కోలాట బృందం మొదటి స్థానంలో నిలిచి 20వేల రూపాయలు నగదు బహుమతి, ప్రతి కళాకారుడికి ప్రశంసా పత్రము గురువులకు శాలువా తో పరసరత్నం,శెరత్ చంద్ర, యాదగిరి, కుమార్ రెడ్డి చేతులమీదుగా సత్కరించినారు.
ఈ నృత్య పోటీలలో చిన్నారి గీతిక కోలాట నృత్యానికి వీక్షకులు మంత్రముగ్ధులైనారు.ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి గ్రూప్ సభ్యులకు ప్రశంస పత్రాలు, గురువు లకు శాలువా లతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో భజన బృందాల పోటీలకు న్యాయ నిర్నేతలుగా గాయకులు, కవి కడివేటి మునిరత్నం, రెడ్డి ప్రసాద్,రెడ్డప్ప, మరియు ఎన్ ఎస్ ఎఫ్ ఫౌండర్ నీరుగట్టు నగేష్, డీఎస్పీ శ్యాంసుందర్, ఆర్పీ ఐ అధ్యక్షులు అంజయ్య,రామచంద్రారెడ్డి, సురేంద్ర కుమార్ రెడ్డి, మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోల హరినాథ్, వివిధ జిల్లా ల నుండి వచ్చిన కళాకారు లు, గురువు లు మొదలైన వారు పాల్గొన్నారు.
మల్లంగుంట లో సంబరాలు
తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీలో శ్రీరామ కోలాట బృందం కి ఘన స్వాగతం లభించింది. కస్తూరి రత్నం 5వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం పేదలకు ఉచిత వైద్య శిబిరాలు జానపద కళాకారులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ జానపద భజన పోటీలకు వివిధ జిల్లాల నుంచి 15 బృందాలు పోటీ పడగా తిరుపతి రూరల్ మండలం, మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీ కి చెందిన శ్రీరామ కోలాట బృందం ప్రథమ బహుమతి ప్రశంసా పత్రాలు అందుకని సందర్భంగా గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద ఘన స్వాగతం పలికారు. టపాకాయలు కాల్చుతూ గ్రామంలోకి స్వాగతం పలికి గ్రామ దేవత వెలవాడమ్మ ముత్యాలమ్మ ఆలయం దగ్గర కర్పూర హారతులతో స్వాగతం పలికి ఆనందం వ్యక్తపరుస్తూ భజన బృందం సభ్యులను పిల్లల్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తిరుపతి సుధాకర్, అశోక్, సుభాష్, మచ్చల హరి ప్రసాద్, రామానుజ, పల్లె గురవయ్య, తిరుపతి రామచంద్రయ్య, సుమలత మనోజ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.