ప్రేమ పేరుతో వేధిస్తూ యువతిపై పెట్రోల్ పోసిన వ్యక్తి అరెస్ట్ :ఎస్ఐ ముత్తయ్య

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 12: సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై ముత్తయ్య, ఏఎస్ఐ లు బలరాం రెడ్డి, సురేందర్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై ముత్తయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మొటమర్రి గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికే చెందిన తన స్కూల్ జూనియర్ యువతి(23)ని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఆ యువతి 3 నెలల నుండి హుజూర్ నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటూ కోదాడ రోడ్డకు గల దీపెన్ ఏఐ ఆఫీస్ నందు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. కాగా సోమవారం మద్యాహ్నం 02.30 గంటల సమయంలో సదరు యువతికి ఫోన్ చేసి మాట్లాడాలని రమ్మని కోరగా ఆమె ఆఫీస్ నుండి బయటకు రాగా తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో గొడవపడి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్లో ఉన్న పెట్రోల్ ఆమెపై పోసి చంపడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బుధవారం నిందితుడిని అరెస్టు చేసి ద్విచక్ర వాహన ,సెల్ ఫోన్, పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వెల్లడించారు.

ప్రేమ పేరుతో వేధిస్తూ యువతిపై పెట్రోల్ పోసిన వ్యక్తి అరెస్ట్ :ఎస్ఐ ముత్తయ్య

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 12:
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై ముత్తయ్య, ఏఎస్ఐ లు బలరాం రెడ్డి, సురేందర్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై ముత్తయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మొటమర్రి గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికే చెందిన తన స్కూల్ జూనియర్ యువతి(23)ని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఆ యువతి 3 నెలల నుండి హుజూర్ నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటూ కోదాడ రోడ్డకు గల దీపెన్ ఏఐ ఆఫీస్ నందు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. కాగా సోమవారం మద్యాహ్నం 02.30 గంటల సమయంలో సదరు యువతికి ఫోన్ చేసి మాట్లాడాలని రమ్మని కోరగా ఆమె ఆఫీస్ నుండి బయటకు రాగా తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో గొడవపడి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్లో ఉన్న పెట్రోల్ ఆమెపై పోసి చంపడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బుధవారం నిందితుడిని అరెస్టు చేసి ద్విచక్ర వాహన ,సెల్ ఫోన్, పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వెల్లడించారు.

About The Author

Related Posts