హుజూర్ నగర్ నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారీ కేంద్రం పై ఏపీ తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల దాడులు
గుంటూరు జిల్లా ఎక్సైజ్ స్పెషల్ ఫోర్స్ విచారణ తో కల్తీ మద్యం దందా గుట్టు రట్టు.. పరారీ లో ప్రధాన సూత్రధారి
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 21:
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం లో కల్తీమద్యం తయారు చేసి ఆంధ్ర, తెలంగాణ లలో ని వైన్స్ ల ద్వారా విక్రయాలు జరుపుతున్న ముఠాను ఏపీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. రామాపురం లో ఓ మూతబడిన రైస్ మిల్ లో స్పిరిట్, డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేసి మద్యం తయారు చేసి విక్రయిస్తుండగా ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె లో తెలంగాణ నుంచి వెళ్లిన మద్యం లోడు లారీ ఎక్సైజ్ స్పెషల్ ఫోర్స్ పోలీసులకు దొరకడంతో లారీలో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం రామాపురంలో డొంక కదిలింది సోమవారం ఏపీ పోలీసులు, తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వడంతో ఏపీ ఎక్సైజ్ అధికారులు,తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సూపర్డెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది తో కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది.
మేళ్లచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన తోట శివ శంకర్, సూర్యప్రకాష్ అను వ్యక్తి ఇల్లు మరియు షెడ్ లో సుమారు 832 లీటర్ల స్పిరిట్ ను నిల్వ చేయడం జరిగింది.ఖాళి బాటిల్స్ లో స్పిరిట్ ను నింపి మూతలు బిగించి నకిలీ లేబుళ్ల ని అతికించి అమ్మకం చేస్తున్నారు. ఈ దాడుల లో 832 లీటర్ల స్పిరిట్ తో పాటు 326 లీటర్ల బ్యాటిల్ లో నింపబడిన 38 కాటన్ల ఎం సి విస్కీ బాటిల్స్ ను స్వాధీనం చేసుకోవడమైనది. నకిలీ లేబుల్స్ మరియు ఎక్సైజ్ హీల్స్ తో పాటు స్వాధీనం చేసుకోవడమైనది. ఎక్విప్మెంట్ ని సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇట్టి కేసు లో తోట శివ శంకర్ తో పాటు దుర్గి కి చెందిన శ్రీరాం మహేష్ షెడ్ ఓనర్ సూర్య ప్రకాష్ పై కేసు నమోదు చేయడమైనది మొదటి వ్యక్తి తోట శివశంకర్ పరారీ లో వుండగా మిగిలిన వారిని అరెస్టు చేయడమైనది. వీరికి స్పిరిట్ లేబుల్స్ క్యాప్స్ సప్లై చేసిన హైదరాబాద్ కు చెందిన రూతుల శ్రీనివాస్ తో పాటు శ్రీ కృష్ణా ఫార్మా కు చెందిన శివ చరణ్ సింగ్ పై కూడా కేసు నమోదు చేయడమైనదని హుజూర్ నగర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ నాగార్జున రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
మేళ్లచెరువు మండలం వేపల మాదారం గ్రామానికి చెందిన లొడంగి నవీన్ వ్యక్తి ఇంటిపై సోమవారం ఉదయం దాడి చేసి 150 స్పిరిట్ (20 లీటర్ల వాటర్ క్యాన్లు) ఉపయోగించిన క్యాన్లు ను ఎక్స్చేంజ్ అధికారులు స్వాధీనం చేసుకొని నవీన్ ను కూడా తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఇట్టి విషయంపై నాగార్జున రెడ్డి వివరణ కోరగా నవీన్ వద్ద ఖాళీ బాటిల్స్ మాత్రమే లభించాయని విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. మేళ్లచెరువులో 35 లీటర్లు పట్టే నీలి రంగు క్యానులు 24×35=840 లీటర్లు,కార్మెల్ బాటిల్స్ 12, రామాపురంలో 38 కాటన్స్ ఒక్కొక్క కాటన్ లో 48 బాటిల్స్(180ఎం ఎల్) 328.32 లీటర్లు,హీల్స్ ఒక బండిల్, లేబుల్స్ 170 సీట్స్ 7820 లేబుల్స్,స్టీల్ వేసిల్స్ 5,ఎస్సేన్స్ ఫ్లవర్(బ్లెండ్స్) 9 క్యాన్స్, ఓ ఏ బి లిక్కర్ యాప్స్ 56.3 కేజీలు, ఎంసీ లిక్కర్ క్యాప్స్ 42.8 కేజీలు, ఎంసీ లిక్కర్ ఎంపీ బాటిల్స్ 59బ్యాక్స్59×200=11, 800బాటిల్స్, మరియు 4 విల్లర్ ఏపీ 07 డి జెడ్ 6789 లను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీగా కల్తీ మద్యం స్వాధీనం చేసుకోవడంతో మద్యంప్రియులు ఉలిక్కి పడ్డారు. కల్తీ మద్యం తయారు చేసిన వారిపై దానికి సహకరించిన అధికారులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మద్యంప్రియులు కోరుతున్నారు.