సిపిఐ నేత దొడ్డ నారాయణ రావు మరణం సమాజంలోని అనేక వర్గాలకు, పార్టీకి తీరని లోటు

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

సిపిఐ నేత దొడ్డ నారాయణ రావు మరణం సమాజంలోని అనేక వర్గాలకు, పార్టీకి తీరని లోటు

సూర్యాపేట జిల్లా బ్యూరో( భారత శక్తి) జూలై 21:
సిపిఐ నేత దొడ్డ నారాయణ రావు మరణం సమాజంలోని అనేక వర్గాలకు, పార్టీకి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు సంతాప సభలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జనం బాధలు తెలిసిన గొప్ప నాయకుడనిస్వాతంత్ర పోరాటంలోనూ సాయుధపోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించిన గొప్ప నాయకుడన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశాడని రాజకీయాల్లో మానవ విలువలు పెంచాలని కోరారు.

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచంలోనే అనేక దేశాలపై ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోచేందుకు కుట్ర చేస్తున్నాయని ఆవేదన చెందారు. ప్రపంచంలోనే ఒక దేశానికి చెందిన ప్రధానమంత్రిని చంపుతామని బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయని ఆవేదన చెందారు. వ్యాపార రాజకీయాలను దూరంగా పెట్టాలన్నారు. పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూపాటుపడాలని పిలుపునిచ్చారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన గొప్ప నాయకుడు నారాయణరావు అని అన్నారు.కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, గన్న చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నాగార పాండు, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, బొమ్మ కంటి ప్రభాకర్ గౌడ్,పల్లె వెంకట్ రెడ్డి,ఎల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, దంతాల రాంబాబు,సిపిఐ జాతీయ రాష్ట్ర నేతలు కనగాల వెంకటరామయ్య, బండ్లకోటయ్య, బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఎన్ హెచ్ 167 పై అఖిలపక్షం ధర్నా..

About The Author