ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానంలో సహస్రనామ ఫల పుష్పార్చన
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై21:
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ శ్రీ శాల్మలి కంద ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం లో బహుళ ఏకాదశి సందర్భంగా ఉదయం 10 గంటలకు 33 వ సహస్రనామ ఫల పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యరగాని గోపాలం ధర్మపత్ని ఎలమంచమ్మ దంపతులు బూరుగడ్డ వారు చేయించగా,సురభి సైదులు ధర్మపత్ని శాంతమ్మ దంపతులు అన్నప్రసాధ వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యరగాని గురవయ్య, ధర్మకర్తలు తిపిరిశెట్టి హరీష్ కుమార్. కోల కృష్ణ ప్రసాద్, గంధం అంజయ్య, వేముల నరసింహారావు, పెనుబేల్లి హనుమంతరావు, మెరిగా కవిత, మరియు ఆలయకార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, ఆలయ అర్చకులు ముడుంబై హరీష్ కుమారా చార్యులు, పరవాస్తు శ్రీనివాసచార్యులు,వేముల వెంకట లక్ష్మణరావు, అద్దంకి శ్రీనివాసరావు, యరగాని వీరస్వామి, మాడుగుల లింగయ్య, చిమాట సైదులు, యరగాని వెంకటేశ్వర్లు, గురవయ్య,రెబ్బ శ్రీనివాస్, కామిశెట్టి అంజయ్య, అనసూర్యమ్మ, మాధవి, నాగ సునీత, లక్ష్మమ్మ, అరుణమ్మ, రమాదేవి,అనిత,సుభద్ర, కామేశ్వరమ్మ, సురభి వెంకటమ్మ, సముద్ర మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.