సాంస్కృతిక కళా వైభవాన్ని చాటిన అల్ఫోర్స్ పరిమళోత్సవ్
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూలై19: సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని తద్వారా వారికి విజయాలు సాధించడం చాలా సులభంగా అవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్థానిక హన్మకొండలోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో పరిమళోత్సవం పేరుతో నిర్వహింపబడిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సరస్వతి మాత విగ్రహానికి పూలమాల వేసి అట్టహాసంగా విద్యార్థుల కేరింతల మధ్య వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి వనరులతోపాటు పాటు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని వారు తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎదురైనటువంటి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని వారు చెప్పారు. అదేవిధంగా 1991 లో ప్రారంభించిన అల్ఫోర్స్ విద్యాసంస్థలు నేటికీ తరగని ఉత్సాహంతో ఇతర విద్యా సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ తెలంగాణ రాష్ట్ర విధానానికి గొప్ప మార్గదర్శిగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హనుమకొండ బ్రాంచ్ విద్యార్థులు చాలా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ హన్మకొండ కీర్తిని ఇనుమడింప చేస్తున్నారని వారు కొనియాడారు.
ఇటీవల కాలంలో ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు మరియు తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.
వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేసాయి ముఖ్యంగా విద్యార్థుల చేసినటువంటి విద్యార్థి జీవితం గొప్పది నాటిక మంత్రముగ్ధులను చేసింది.
ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.