యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు
యూరియా సమస్య ఎప్పటిలోపు పరిష్కరిస్తారో ప్రభుత్వ విప్ స్పష్టతనివ్వాలి. తక్షణమే పరిష్కరించకపోతే నిసన కార్యక్రమాలు చేపడతామని చల్మెడ డిమాండ్.
వేములవాడ :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, మండలానికి యూరియా కేటాయింపులో పక్షపాత ధోరణి దారుణమని బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ,యూరియా సరఫరాలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు గంటల తరబడి కేంద్రాల వద్ద బారులు తీరాల్సి వస్తోందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు, యూరియా కోసం అర్ధరాత్రి వరకు క్యూల్లో నిలబడే పరిస్థితులు ఏర్పడ్డాయని,ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. రుద్రంగి సహా పలు ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా, స్థానిక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించకపోవడం బాధకరమని విమర్శించారు. జిల్లాకు ఎంత యూరియా అవసరమో,ఎంత వచ్చిందో, ఇంకా ఎంత కొరత ఉందో సమీక్షించి చర్యలు తీసుకోవడంలో అధికారులు,విప్ విఫలమయ్యారని ఆయన అన్నారు.చందుర్తి, సనుగుల సొసైటీల వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ జరుగుతోందని పేర్కొంటూ,ఇది పరిస్థితుల తీవ్రతకు నిదర్శనమని అన్నారు.కాళేశ్వరం నుంచి నీరు రాకపోవడంతోనే సాగు కష్టాల్లో ఉన్న రైతులకు,పంటలకు సకాలంలో యూరియా ఇవ్వక ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు.