ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసుల ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 18:
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసుల ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్, కామేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పర్యటించి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ, పరీక్ష గది, ఆసుపత్రిలో మందుల నిల్వలు, సాధారణ ప్రాధమిక వైద్య సేవలు, గర్భిణీ మహిళలకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణ, ప్రజలకు అందించనున్న చికిత్సలు, క్యాజువాలిటీ, ఓపీ సేవలు, ల్యాబ్ లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ఇన్ పేషంట్ వార్డ్ లను కలెక్టర్ పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డులో జ్వరంతో చికిత్స పొందుతున్న సోహాయిల్ తో కలెక్టర్ ఆరోగ్య పరిస్థితి, కేంద్రంలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ల్యాబ్ లో ఏ ఏ రకాల పరీక్షలు, రోజుకు ఎన్ని చేపడుతున్నవి, కేంద్రంలో చేస్తున్నవి, సాంపిల్స్ జిల్లా కేంద్రానికి పంపుతున్న వివరాలు తనిఖీ చేశారు. కిట్లు అందుబాటులో ఉన్న అత్యవసర పరీక్షలు కేంద్రంలోనే చేపట్టాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ ఏం ఏం బాధ్యతలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిట్ లు ఎంత మంది, సిబ్బంది ఎంత మంది ఉంది అడిగి తెలుసుకున్నారు. ఇడిడి క్యాలండర్ గురించి అడిగి అప్ డేట్ చేయక పోవడంతో వెంటనే చేయాలన్నారు. స్టాఫ్ టూర్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా నమోదు చేయాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పిడపనే టూర్ ప్రోగ్రామ్స్ లో నమోదుచేసి వెళ్లాలని అన్నారు. ఏఎన్సి రిజిస్టర్ తనిఖీ చేసి, ఎంసిహెచ్ పోర్టల్ లో అప్ డేట్ చేయాలన్నారు.
గర్భిణులకు అందించు వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో లేబర్ రూమ్, సిబ్బంది అందుబాటులో ఉన్నందున సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసులు చేపట్టాలని అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 13 సబ్ సెంటర్లు, 64 మంది ఆశాలు ఉన్నారని, ఇడిడి ప్రకారం గర్భిణులను ఫాలో అప్ చేయాలన్నారు. ప్రసవాలు కనీసం 30 జరగాలన్నారు. శుక్రవారం డ్రై డే ను పాటించాలన్నారు. ఎన్సి ఓపి ఎంత మంది వస్తున్నది, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా కేసులు ఎన్ని నమోదు అయినవి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందుల జాబితా తయారుచేసి, మందులు స్టాక్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అన్నారు.
అనంతరం పశు వైద్యశాల వద్దకు వెళ్లి, చికిత్స కు వచ్చిన మేకలను కలెక్టర్ పరిశీలించారు. సోమాటైటిస్ తో మేకలు బాధపడుతున్నట్లు పశు వైద్య అధికారి తెలిపి, మందులు సరఫరా కావాలన్నారు. భవనం శిథిలావస్థకు చేరినందున పీఆర్ ఇంజనీరింగ్ శాఖతో ఎస్టిమేట్ వేసి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అక్కడ ఉన్న వారితో కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని గేదెలు ఉన్నవి, ఎంత పాల ఉత్పత్తి జరుగుతుంది, పాలు ఎక్కడ అమ్ముతున్నది అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా చేస్తామని, బిల్లులు ప్రతి సోమవారం ఖాతాలో జమచేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ తనిఖీల సందర్భంగా వైద్యాధికారిని డా. శిరీష, పశు వైద్య అధికారి డా. జి. నాగులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.