ప్రతీ ఓటును గెలవాలంటే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలు,అభివృద్ధి కృషిని నిక్షిప్తంగా వివరించాలి

బొబ్బా భాగ్యరెడ్డి

ప్రతీ ఓటును గెలవాలంటే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలు,అభివృద్ధి కృషిని నిక్షిప్తంగా వివరించాలి

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 22: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని దొండపాడు గ్రామంలో, బిజెపి  మండల అధ్యక్షులు పత్తిపాటి విజయ్  అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల మండల స్థాయి కార్యచరణ నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు మాజీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి బలోపేతం కలిగించే కీలక అవకాశంగా ఉపయోగించుకోవాలని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతీ ఓటును గెలవాలంటే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలు,అభివృద్ధి కృషిని నిక్షిప్తంగా వివరించాలన్నారు.

ప్రజల మద్దతును పొందే మార్గం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేకూర్చడమేనని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వలా యోజన, ఆవాస్ యోజన, హర ఘర్ జల్ వంటి పథకాలు దేశంలోని కోటి మందికి పైగా లబ్ధి చేకూర్చినట్లు గుర్తు చేశారు. కార్యకర్తలు సాధారణ ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులను నిస్సంధేహంగా ప్రజలకు వివరించాలి అని సూచించారు.కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధపు ప్రచారాలు చేసింది అమలకు చేతకాని 420 హామీలతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసింది.

Read More మీరు భయపడ్డారా.. అంతే సంగతులు...

ఈ వర్క్‌షాప్‌లో ఎన్నికల నిర్వహణ,ఓటర్ల విశ్లేషణ, ప్రచార వ్యూహాలు, బూత్ స్థాయి సమన్వయం, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి కార్యకర్త అభివృద్ధి ప్రజల మధ్య నమ్మకం నింపాలని భాగ్యరెడ్డి  స్పష్టంగా పేర్కొన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల మండల ప్రభారీ బాల వెంకటేశ్వర్లు, కాటిబోయిన లింగరాజు, బండారు నాగరాజు, కొమ్ము రమేష్,  మామిడి వెంకటేశ్వర్లు,పొల్ల నరసింహా రావు కొంకాయల మస్తాన్ రెడ్డి,భీమన  చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Read More సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు..

About The Author