జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ కి పొంగులేటి అభినందనలు
ఖమ్మం : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే-ఐజేయు)కు నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, తెరాస రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర రావు, కోశాధికారి శివ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, కార్యదర్శి కనకం సైదులు తో పాటు టీయూడబ్ల్యూజే-ఐజేయు నగర అధ్యక్షులుగా ఎన్నికైన మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసులను, ఇతర కమిటీ సభ్యులనూ పొంగులేటి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం బాధ్యులు ముందుండి పోరాడాలని సూచించారు. అవసరమైతే ఈ పోరాటానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాం నారాయణ, ఎన్.వెంకట్రావు, మురారి, భూపాల్ రావు, మాధవరావు, గోపి, మహేందర్ రెడ్డి, ఏ.రామారావు, కే.రజినీకుమార్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.