విద్యార్థులు ఆంగ్లంలో సంభాషించేలా తయారు చేయాలి:జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం బ్యూరో, భారత శక్తి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి అనర్గళంగా ఆంగ్లంలో సంభాషించేలా తయారుచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ లతో కలిసి కొణిజెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వి కెన్ లెర్న్ వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వి కెన్ లెర్న్ కార్యక్రమాన్ని జిల్లాలో ముందస్తుగా 16 పాఠశాలల్లో ప్రారంభించి, తరువాత మరో 18 పాఠశాలలకు విస్తరించడం జరిగిందని, మొత్తం 61 మంది హైస్కూల్ టీచర్స్ కు ఒక రోజు వర్క్ షాప్ లో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. రోజువారి జీవితంలో మాట్లాడే విధంగా పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని అన్నారు. పాఠశాలలను సందర్శించే సమయంలో ఇంగ్లీషులో పరిజ్ఞానం ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులు మాట్లాడేందుకు భయపడటం, సిగ్గు పడటం గమనించానని, దీనిని తొలగించేలా మనం పని చేయాలని అన్నారు. తరగతి గదిలో బ్యాక్ బెంచ్ లో కూర్చున్న విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని, దానికి తగిన విధంగా వి కెన్ లెర్న్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ తరగతి గదులలో పిల్లలను అధికంగా భాగస్వామ్యం చేయాలని, వివిధ రకాల సందర్భాలను వారికి తెలియజేస్తూ పిల్లలతో అధికంగా మాట్లాడించాలని కలెక్టర్ తెలిపారు. రోజువారి జీవితంలో జరిగే అంశాలను ఆంగ్లంలో తెలిపే విధంగా విద్యార్థులను తయారు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లలకు ఆంగ్లం తెలిస్తే పోటీ ప్రపంచంలో ఇతరులతో కమ్యూనికేట్ చేయడం చాలా సులభం అవుతుందని అన్నారు. మనం చేపట్టే కార్యక్రమం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఇంటర్వ్యూలలో చాలా ఉపయోగపడుతుందని, తక్కువ సమయంలో మన గురించి ఇతరులకు తెలిపేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఒక రోజు వర్క్ షాప్ ద్వారా శిక్షణ అందించడం జరిగిందని, ఇందులో ఉత్సాహంగా ఉపాధ్యాయులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వర్క్ షాప్ లో తెలుసుకున్న అంశాల గురించి ఫీడ్ బ్యాక్ అందించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేందుకు వర్క్ షాప్ లో తెలిపిన పద్ధతులను ఉపయోగించాలని, విద్యార్థుల్లో విశ్వాసం పెంచి ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ, ఏ.ఏం.ఓ. రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి అబ్రహం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంత కుమారి, వి.కే.ఎన్ లెర్న్ వర్క్ షాప్ చీఫ్ మెంటర్స్ ఆస్ర , పవిత్ర దీక్షిత్, ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ జే జగదీష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఆంగ్లంలో సంభాషించేలా తయారు చేయాలి:జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం బ్యూరో, భారత శక్తి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి అనర్గళంగా ఆంగ్లంలో సంభాషించేలా తయారుచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ లతో కలిసి కొణిజెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వి కెన్ లెర్న్ వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వి కెన్ లెర్న్ కార్యక్రమాన్ని జిల్లాలో ముందస్తుగా 16 పాఠశాలల్లో ప్రారంభించి, తరువాత మరో 18 పాఠశాలలకు విస్తరించడం జరిగిందని, మొత్తం 61 మంది హైస్కూల్ టీచర్స్ కు ఒక రోజు వర్క్ షాప్ లో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.
రోజువారి జీవితంలో మాట్లాడే విధంగా పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని అన్నారు. పాఠశాలలను సందర్శించే సమయంలో ఇంగ్లీషులో పరిజ్ఞానం ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులు మాట్లాడేందుకు భయపడటం, సిగ్గు పడటం గమనించానని, దీనిని తొలగించేలా మనం పని చేయాలని అన్నారు. తరగతి గదిలో బ్యాక్ బెంచ్ లో
కూర్చున్న విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని, దానికి తగిన విధంగా వి కెన్ లెర్న్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు.
స్పోకెన్ ఇంగ్లీష్ తరగతి గదులలో పిల్లలను అధికంగా భాగస్వామ్యం చేయాలని, వివిధ రకాల సందర్భాలను వారికి తెలియజేస్తూ పిల్లలతో అధికంగా మాట్లాడించాలని కలెక్టర్ తెలిపారు. రోజువారి జీవితంలో జరిగే అంశాలను ఆంగ్లంలో తెలిపే విధంగా విద్యార్థులను తయారు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పిల్లలకు ఆంగ్లం తెలిస్తే పోటీ ప్రపంచంలో ఇతరులతో కమ్యూనికేట్ చేయడం చాలా సులభం అవుతుందని అన్నారు. మనం చేపట్టే కార్యక్రమం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఇంటర్వ్యూలలో చాలా ఉపయోగపడుతుందని, తక్కువ సమయంలో మన గురించి ఇతరులకు తెలిపేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఒక రోజు వర్క్ షాప్ ద్వారా శిక్షణ అందించడం జరిగిందని, ఇందులో ఉత్సాహంగా ఉపాధ్యాయులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వర్క్ షాప్ లో తెలుసుకున్న అంశాల గురించి ఫీడ్ బ్యాక్ అందించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేందుకు వర్క్ షాప్ లో తెలిపిన పద్ధతులను ఉపయోగించాలని, విద్యార్థుల్లో విశ్వాసం పెంచి ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ, ఏ.ఏం.ఓ. రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి అబ్రహం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంత కుమారి, వి.కే.ఎన్ లెర్న్ వర్క్ షాప్ చీఫ్ మెంటర్స్ ఆస్ర , పవిత్ర దీక్షిత్, ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ జే జగదీష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts