ఎల్బీనగర్లో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ..

* సరైన నియంత్రణ లేకపోవడంతో రెచ్చిపోతున్న వైనం..
* లంచాలకు బానిసలై పోతున్న ఆరోగ్యశాఖ అధికారులు..
* వీరికి వంత పాడుతున్న జిహెచ్ఎంసి అవినీతి అధికారులు..
* అనుమతులు లేకుండా నడుస్తున్న ఎన్నెన్నో ఆసుపత్రులు..
* ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండానే ఆసుపత్రుల నిర్వహణ..
* ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారం భారీ ఫీజులు వసూలు చేస్తున్న దుర్మార్గం..
* అక్రమ నిర్మాణాలలో, భవంతుల్లో నిర్వహిస్తున్న ఆసుపత్రులు..
*కేవలం దోపిడీయే తమ ఎజెండాగా సాగిపోతున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు...
* ప్రాణాలు పోయినవారికి సైతం వైద్యం నిర్వహిస్తున్నామని లక్షల్లో దోచుకున్న ఉదంతాలు ఎన్నెన్నో..
* ఈ దోపిడిపై యుద్ధాన్ని ప్రకటిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

download (1)

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )


ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి సులువుగా చేరుకోగల ప్రాంతం.. తగిన రవాణా సౌకర్యం కలిగి ఉంది.. అలాగే ఇక్కడ అన్ని వసతులు లభిస్తాయి.. అన్ని ప్రాంతాల వారు అన్ని భాషలవారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు.. అదే ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతం.. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పోరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు చాలానే నెలకొని ఉన్నాయి.. అందువల్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎంతోమంది వైద్యం కొరకు ఎల్బీనగర్కు వస్తూ ఉంటారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ కార్పోరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు విపరీతమైన దోపిడీకి తెరతీసాయి.. తమ వద్దకు వచ్చే రోగులను బ్రతికించే ప్రక్రియను పక్కనపెట్టి కేవలం వారి నుంచి దోచుకోవడమే తమ ఎజెండాగా మార్చుకున్నాయి ఇక్కడి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సరైన వైద్యం అందించక ఎన్నెన్నో ప్రాణాలను తీసిన సంఘటనలు అనేకం వెలుగు చూశాయి.. బాధితులతో సెటిల్మెంట్లు చేసుకుంటూ ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి..మరింత దుర్మార్గం ఏమిటంటే ఇక్కడి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు వీరితో పాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా కుమ్మక్కై వారి దోపిడికి సహకరిస్తున్నారు.. ఈ దోపిడిపై యుద్ధాన్ని ప్రకటిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..


ఎల్బీనగర్  నియోజకవర్గంలో అలాగే హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో  ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ, అధిక ఫీజులు, అవసరం లేని పరీక్షలు, బిల్లులలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలు నిజంగా ప్రజలకు భారంగా మారాయి. మరీ ముఖ్యంగా ఎల్బీనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బరితెగించి పోతున్నడం దురదృష్టకరం.. మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారా జిహెచ్ఎంసి అధికారులు ఏమి చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది.. అక్రమంగా నిర్మించిన భవంతుల్లో ఆసుపత్రుల నిర్వహణ. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఆసుపత్రులు నడుస్తూ ఉన్నాయి.. ఒకటి కాదు రెండు కాదు చాలా ఆసుపత్రులు ఇలాగే నడుస్తూ ఉన్నాయి.. వీటిపై కొరడా దులిపించాల్సిన ఆరోగ్యశాఖ అధికారులు లంచాలకు మరిగి నిద్రబోతున్నారు.. వీరికి తోడు జిహెచ్ఎంసి అధికారులు కూడా తోడయ్యారు.. దీంతో తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఆసుపత్రులకు వస్తున్న రోగులు డబ్బులు చెల్లిస్తూ ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.. వైద్యో నారాయణో హరి అంటారు.. కానీ ఇక్కడి ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చి అందరూ హరి అని పైకి పోతున్నారు..

ప్రైవేట్ ఆసుపత్రుల ఆధిపత్యం:

ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువ సంఖ్యలో ఉండటం, పరికరాల కొరత, సిబ్బంది కొరత కారణంగా ఎక్కువమంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

అధిక బిల్లులు:

చిన్న చిన్న చికిత్సలకు కూడా వేలల్లో, ల‌క్షల్లో బిల్లులు చెల్లించాల్సిన దుర్భర పరిస్థితి నెలకొని ఉంది.. నిస్సిగ్గుగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులు తమకు నచ్చినట్లు వేస్తున్నారు.. మధ్యతరగతి పేద ప్రజలు ఆసుపత్రుల బిల్లుల కొరకు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇంత కష్టపడి బిల్లులు చెల్లించినా తమ వారి ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం లేకుండా పోతోంది.. కేవలం బిల్లుల మీద మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లు దృష్టిని పెడుతున్నారు. వీరికి రోగుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతోంది..

ప్రభుత్వ నిర్లక్ష్యం:

ఆరోగ్య శాఖ, జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రులపై నిరంతర తనిఖీలు చేయకపోవడం వల్ల ఈ దోపిడీ కొనసాగుతోంది. ఎందుకంటే నెల నెల వీరికి లక్షల్లో ముడుపులు అందుతున్నాయి కాబట్టి నిమ్మకుండి పోతున్నారు.. రేపటి రోజున వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే అప్పుడు తెలుస్తుంది.. కనీసం ఈ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు అధికారులు..

ఆరోగ్య బీమా సమస్యలు:

చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య బీమా అంటే ఆరోగ్యశ్రీ  లేదా ఇతర పథకాలను అంగీకరించకపోవడం లేదా రోగులను అవగాహన లేకుండా మోసం చేయడం జరుగుతోంది. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు గానీ జిహెచ్ఎంసి అధికారులు గానీ ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు..

ప్రజల పరిస్థితి :

మధ్యతరగతి, పేద వర్గాలు అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారు.
రోగి కంటే బిల్లు చూసి ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల లేమి వల్ల వారు మళ్లీ ప్రైవేట్ వైపు మళ్లాల్సి వస్తోంది.

అవసరం లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం.. అలాగే ఆపరేషన్లు చేయకపోతే రోగి బ్రతకడు అని భయపెట్టడం.. రోగి కుటుంబ సభ్యుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేయడం ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంది.. మరి నీచమైన విషయం ఏమిటంటే అర్హత లేని వారు కూడా ఈ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారు.. రేడియేషన్ స్పెషలిస్ట్ ఆపరేషన్లు చేసేస్తున్నారు.. నర్సులు వైద్యం చేసేస్తున్నారు.. ఇలా ఆపరేషన్లు చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు అనేక అనేకం చూసాం.. తీరా రోగి ప్రాణాలు పోయాక తమను తాను రక్షించుకోవడానికి ఆసుపత్రిని రక్షించుకోవడానికి అధికారులు పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులను మేనేజ్ చేస్తూ అంతో ఇంతో డబ్బులు చెల్లిస్తూ ఆ కేసును వెలుగు చూడకుండా చేస్తున్నారు..

అసలు ఇదంతా ఎలా జరుగుతోంది కేవలం ప్రభుత్వ వైఫల్యమే కదా.. సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కదా.. వీరందరి ధన దాహమే కదా.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి..

 పరిష్కారాలు :

ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ బోర్డు, అంటే రెగ్యులేటరీ అధారిటీని శక్తివంతం చేయాలి నిరంతరం పనిచేసేలా చూడాలి.. 

ప్రతి ఆసుపత్రి టారిఫ్ లిస్ట్ పబ్లిక్‌గా ప్రదర్శించాలి. ఈ లిస్ట్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా చూసుకోవాలి..

హెల్త్ హెల్ప్‌లైన్.. 24/7 గ్రీవెన్స్ సెల్ ఆక్టివ్ గా ఉండేలా చూడాలి..

ఆరోగ్యశ్రీ లాంటి అత్యుత్తమ పథకాలను అన్ని ఆసుపత్రుల్లో తప్పనిసరిగా అమలు చేయాలి. వీటన్నిటి కంటే ముఖ్యంగా ఎల్బీనగర్లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.. ఆ ఆసుపత్రి నిర్వహణ పటిష్టంగా అమలు చేయాలి.. ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులపై ఉక్కు పాదం మోపగలగాలి.. అప్పుడే కొంతవరకైనా సమస్యలు పరిష్కరించబడతాయని భావిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "

ఈ క్రమంలో సాధారణ ప్రజానీకం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
బిల్లులు, చికిత్స వివరాలు రాతపూర్వకంగా తీసుకోవాలి.

మోసం జరిగితే జిల్లా ఆరోగ్య అధికారులకు లేదా కస్టమర్ కోర్టుకు ఫిర్యాదు చేయాలి.

సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా దోపిడీ ఉదంతాలను బయటపెట్టాలి.

సామాజిక అవగాహన ముఖ్యమైన ప్రక్రియ :

ఎన్ జి ఓ లు, స్థానిక సంఘాలు ఆరోగ్య హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.

“హెల్త్ ఫర్ ఆల్” అనే ప్రజా ఉద్యమం అవసరం అని భావిస్తోంది ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది " ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "

About The Author