మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

జీవిత, రాజశేఖర్ (Jeevitha and Rajasekhar) కుమార్తెలు తెలుగుతో పాటు తమిళ్‌లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే శివాత్మిక తమిళ ప్రేక్షకుల నుంచి గుర్తింపును సొంతం చేసుకుంది కూడా. సరైన విజయం అయితే ఆమెకి ఇంకా దక్కలేదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడామెకు మరో అవకాశం వరించింది. తమిళ చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొంది, హీరోగా నటిస్తున్న అర్జున్‌దాస్ సరసన శివాత్మిక రాజశేఖర్‌ (Shivathmika Rajasekhar) హీరోయిన్‌గా నటించనుంది. జెంబ్రియో పిక్చర్స్‌ బ్యానరుపై సుధా సుకుమార్‌ నిర్మించే ఈ చిత్రంలో కాళి వెంకట్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సిల నేరంగలిల్‌ సిల మణిదర్‌గల్‌’ ఫేం విశాల్‌ వెంకట్‌ దర్శకత్వంలో జీవిత వినోదాన్ని వివరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా హీరో అర్జున్‌ దాస్‌ (Arjun Das) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నాజర్‌ వంటి పెద్ద నటుడితో కలిసి పని చేయబోతున్నాను. సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ అభిమానిని నేను. ఆయన సంగీతం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మదురై వచ్చి కథ చెప్పారు. అపుడే ఓకే చెప్పాను. దర్శకుడిపై భారం వేసి ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘అనీతి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు కూడా వారి మద్దతు కోరుతున్నాను’’ అని వెల్లడించారు.

జీవిత, రాజశేఖర్ (Jeevitha and Rajasekhar) కుమార్తెలు తెలుగుతో పాటు తమిళ్‌లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే శివాత్మిక తమిళ ప్రేక్షకుల నుంచి గుర్తింపును సొంతం చేసుకుంది కూడా. సరైన విజయం అయితే ఆమెకి ఇంకా దక్కలేదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడామెకు మరో అవకాశం వరించింది. తమిళ చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొంది, హీరోగా నటిస్తున్న అర్జున్‌దాస్ సరసన శివాత్మిక రాజశేఖర్‌ (Shivathmika Rajasekhar) హీరోయిన్‌గా నటించనుంది.

జెంబ్రియో పిక్చర్స్‌ బ్యానరుపై సుధా సుకుమార్‌ నిర్మించే ఈ చిత్రంలో కాళి వెంకట్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సిల నేరంగలిల్‌ సిల మణిదర్‌గల్‌’ ఫేం విశాల్‌ వెంకట్‌ దర్శకత్వంలో జీవిత వినోదాన్ని వివరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా హీరో అర్జున్‌ దాస్‌ (Arjun Das) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నాజర్‌ వంటి పెద్ద నటుడితో కలిసి పని చేయబోతున్నాను. సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ అభిమానిని నేను. ఆయన సంగీతం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మదురై వచ్చి కథ చెప్పారు. అపుడే ఓకే చెప్పాను. దర్శకుడిపై భారం వేసి ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘అనీతి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు కూడా వారి మద్దతు కోరుతున్నాను’’ అని వెల్లడించారు.

About The Author

Related Posts