ధోనీతో ఆ విషయం చర్చించా..

విశాఖపట్నం: ఒత్తిడి సమయాల్లో ప్రశాంత చిత్తంతో ఆడడాన్ని ధోనీని చూసి నేర్చుకున్నానని టీమిండియా బ్యాటర్‌ రింకూ సింగ్‌ తెలిపాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అలవోకగా గెలివాల్సిన భారత జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో కూల్‌గా ఆడిన రింకూ ఆఖరి ఓవర్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ‘ప్రశాంతంగా..మరీ ముఖ్యంగా చివరి ఓవర్లో ఎలా బ్యాటింగ్‌ చేయాలనే విషయమై ధోనీ భాయ్‌తో చర్చించా. సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉంటూ, బౌలర్‌వైపే నేరుగా చూడాలని అతడు సూచించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో నేను ఒత్తిడికి గురికాకుండా ఆడడం వెనుక సీక్రెట్‌ అదే’ అని రింకూ వివరించాడు

About The Author

Related Posts