ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూలై 19:ని ర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అక్షరాలు, పదాలు చదివించారు. ఆపై హైస్కూల్ తరగతులను సందర్శించి, పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించి, పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, వారి విషయావగహన పరీక్షించారు.

బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి నోట్‌బుక్స్, యూనిఫాంలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వంట గదిని పరిశీలించి, వంట మనుషులు అనుభవం, భోజన మెనూ వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు శుచి, శుభ్రతలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కలెక్టర్, అదనపు కలెక్టర్ లు స్వయంగా భోజనం వడ్డించారు. తర్వాత చిన్నారులతో కలిసి కూర్చొని ముచ్చటిస్తూ మధ్యాహ్న భోజనం తిన్నారు.

Read More ఫ్రెండ్లీ పోలీసా..? పీక్కుదినే పోలీసా..?

IMG-20250720-WA0786

Read More వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్

ఈ సందర్బంగా పాఠశాల ప్రాంగణంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. నీరు పోసిన కలెక్టర్, ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు, మండల ప్రత్యేక అధికారి రాజనర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More రోహిత్ వేముల బిల్లు: కాంగ్రెస్ చేతిలో కమ్యూనిస్టుల కొడవలి

About The Author