యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. నమ్మశక్యం కాని ఫలితం
ట్యూమర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కె.ఎస్ కిరణ్ కుమార్
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 19: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయంలో ఉన్న మహిళను కాపాడినట్లు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ కె.యస్. కిరణ్ కుమార్ తెలిపారు. మెడ వెనుక భాగంలో ఏర్పడిన అరుదైన ట్యూమర్ ను మైక్రో సర్జరీ ద్వారా తొలగించి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడడం జరిగిందని తెలిపారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరుణ తూడి అనే 44 సంవత్సరాలు మహిళకు నెల రోజులుగా ఆకస్మికంగా మెడ ఎడమ భాగంలో వాపు , రెండు కాళ్ళ నొప్పి, చేతులలో పట్టు కోల్పోవటం, తలనొప్పి, వాంతులు, ఆకలి కోల్పోవటం వంటి లక్షణాలతో రావటం జరిగిందని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎం ఆర్ ఐ తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించమని, ట్యూబ్ ఆకారంలో ఉన్న కనితి ని గుర్తించడం జరిగిందన్నారు. ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన ట్యూమర్ అని ,ఇది మెదడును ఒత్తిడికి గురి చేస్తు,ఇంకా ఎడమ కరోటిడ్ స్పేస్ లోకి విస్తరించి అంతర్గత వెర్టిబ్రల్ ఆర్టరీలపై ఒత్తిడి పెంచుతుందని,దీన్ని "శ్వానోమా"గా నిర్ధారించటం జరిగిందన్నారు.
వైద్య బృందం రెండు దశల శస్త్ర చికిత్సలో భాగంగా మొదటి దశలో మెడ ముందు భాగం నుంచి ప్రవేశించి, అంతర్గత కరోటిడ్ ఆర్జరీని ట్యూమర్ నుండి వేరు చేయడం జరిగిందని వివరించారు. రెండవ దశలో, రోగిని వెనక్కు తిప్పి (ప్రమ్ పొజిషన్లో) మెడ వెనుక భాగం ద్వారా శస్త్ర చికిత్స చేసి, సి1 ఆర్స్ను అతి జాగ్రత్తగా వెర్టీబ్రల్ ఆర్టరీకు అంటుకున్న ట్యూమర్ ను వేరుచేసి పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. ఈ క్లిష్టమైన ట్యూమర్ ను తొలగించడానికి అత్యాధునిక కలర్ డాప్లర్ ఇంట్రా ఆపరేటివ్, యం.ఆర్.ఐ.ని ఉపయోగించటం జరిగిందన్నారు.
శస్త్ర చికిత్స సమయంలో న్యూరోమానిటరింగ్ ను ఉపయోగించి నరానికి సంబంధిత పర్యవేక్షణను నిర్వహించామని,శస్త్ర చికిత్స అనంతరం రోగికి ఎడమచేతిలో నొప్పి తగ్గిందని, పట్టుదల మెరుగుపడిందని, కొత్తగా ఎలాంటి నర సంబంధిత లోపాలు కనిపించలేదని వెల్లడించారు.
పేషంటు 5 నెలల తరువాత పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతోందని, ట్యూమర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్సలు ఉండాలని సూచించారు.
ఈ విజయవంతమైన శస్త్ర చికిత్సకు సహకరించిన వైద్య బృందాన్ని యశోదా హాస్పిటల్స్ యాజమాన్యం అభినందించిందని డాక్టర్ కె .ఎస్ .కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఏజిఎం చంద్రశేఖర్, బాధితురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు.