మెగా మల్టీ సోలార్ స్పోర్ట్స్ బ్రాంచ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూలై21:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెగా మల్టీ సోలార్ స్పోర్ట్స్ బ్రాంచ్ సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
తొలుత ఎమ్మెల్యే నాగరాజు కి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ కి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మెగా మల్టీ సోలార్ స్పోర్ట్స్ బ్రాంచ్ యాజమాన్యం కు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా యాజమాన్యం ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ ను శాలువాతో సత్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలోడైరెక్టర్ లు సి. హెచ్.వెంకటరమణ, నవీన్ కుమార్, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.