ఘనంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం 11వ వార్షికోత్సవం

ఘనంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం 11వ వార్షికోత్సవం

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: ప్రముఖ యోగా గురువు చాడ పాపిరెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి బుధవారం కు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం లో సంబరాలు నిర్వహించారు పెద్ద ఎత్తున శిక్షణ తీసుకున్న యోగా సాధకులు పాల్గొని గురువు చాడపాపిరెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫిజియోథెరపీ డాక్టర్. సతీష్ అతిధులుగా సంత్ నిరంకార్ సంస్థ జిల్లా అధ్యక్షురాలు కడారి సరళ సీనియర్ యోగా సాధకులు జాల వెంకట్ రెడ్డి పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో యోగాకు చాలా ప్రాముఖ్యత కలదని,యోగనేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు జరుగుతుందని తెలిపారు.

ముఖ్యంగా యోగాలో ప్రాణాయామము ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆసనాలు,సూక్ష్మ వ్యాయామము,సూర్య నమస్కారాలు చేసినప్పుడు శ్వాసను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోని అవయవాలకు కదలిక వచ్చేసి శరీర రుగ్మతలు,మానసిక ఒత్తిడి, నిద్రలేమి, బీపీ, షుగర్ లను అధిగమించవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా యోగ గురువు చాడ పాపిరెడ్డి మాట్లాడుతూ 2014 న సూర్యాపేట పట్టణంలోయోగా శిక్షణ కేంద్రం స్థాపించి ఎంతో మందికి యోగా ద్వారా ఆరోగ్య పరంగా సేవలు అందిస్తున్నాననీ తెలిపారు.ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికినిత్యసాధన లో యోగ అవసరం అన్నారు.

Read More విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి-

యోగా ద్వారా ఆకస్మిక గుండె పోటు,నిద్రలేమి, మానసిక ఒత్తిడిని జయించ వచ్చు అన్నారు.మీ ఆదరణ వల్లరాష్ట్రస్థాయిలో యోగ ప్రచార సమితి లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగాతెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ సంస్థలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు అధ్యక్షులుగా కొనసాగుచున్నానని తెలిపారు.రాష్ట్ర స్థాయి జాతీయస్థాయిలో జరుగు యోగా పోటీల లోసూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సాధకులు పాల్గొని ప్రతిభ కనపరచడం విశేషం అని తెలిపారు అలాగే మునుముందు కూడా యోగా సాధకులు, అభిమానులు ఇలానే మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

Read More సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు..

ఇక్కడ శిక్షణ పొందిన నల్లెడ సుదర్శన్ రెడ్డి,కట్ట మమతలకు ఆయుష్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధకులు వేల్పుల సుధాకర్,నల్లెడ సుదర్శన్ రెడ్డి భాస్కరాచారి, వల్కిలింగయ్య మల్లారెడ్డి గోరెంట్ల శ్రీనివాస్,ఓ లింగయ్య,బాణాల శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి,మమత,జయలక్ష్మి, సుజాత,మంజుల రజిత,కళావతి, విజయ,లక్ష్మి, శ్రీనాథ్, చంద్రశేఖర్, శేఖర్, రవీంద్ర చారి,నాగరాజు,మధు,మాధవి, శ్రీనివాస్,వెంకటేశ్వర్లు మొదలగు సాధకులు పాల్గొన్నారు.

Read More వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 

About The Author