ఇంధన ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలి
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బుగ్గప్ప డిమాండ్
- పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెంపుతో సామాన్యులపై మరింత భారం
వికారాబాద్:
ఇంధన ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలి
సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు.
జిల్లా కమిటీ సభ్యుడు యు. బుగ్గప్ప కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ..
పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3, సీఎన్‌జీపై కిలోకు రూ.2 చొప్పున ధరలు పెంచడం వల్ల ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయం ఆర్జించిందని, అయితే ఆ ప్రయోజనాలను ప్రజలకు అందించకుండా ఇప్పుడు ధరల పెంపు ద్వారా భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చిన ప్రతిసారీ ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు.
ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ప్రాథమిక సేవల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత పెరుగుతుందని తెలిపారు.
ప్రత్యేకంగా సీఎన్‌జీ ధరల పెంపు ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికులు, ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మంది ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించిందని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బుగ్గప్ప డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం మోపే విధానాలను ప్రభుత్వం నిలిపివేయాలని అన్నారు
