కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ పదవి కమలం కైవసం చేసుకోవాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జులై 19: కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన స్థానిక ఎన్నికలపై కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, కామారెడ్డి జిల్లా ఎన్నికల ప్రభారి ఆకుల విజయ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పార్టీ గెలుపుకు కృషి చేయాలని, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ కమలం కైవసం చేసుకోవాలనీ అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి రమణారెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించిన చరిత్ర కామారెడ్డి ప్రజలది అని గుర్తు చేశారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. కార్యకర్తల ఎన్నికలు జరుగుతున్నందున పోటీ చేయని నాయకులు, కార్యకర్తలు ముందుండి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి బిబి పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణా తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, మర్రి రాంరెడ్డి, నాయకులు పైడి ఎల్లారెడ్డి నరేందర్ రెడ్డి , రవీందర్ రావు, విపుల్ మండల అధ్యక్షులు, స్థానిక సంస్థల ఎన్నికల మండల కన్వీనర్లు, ప్రభారీలు పాల్గొన్నారు.