విద్యార్థులు నిర్దేశించిన గమ్యాలను చేరుకోవాలి

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.

విద్యార్థులు నిర్దేశించిన గమ్యాలను చేరుకోవాలి

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 18:
కాలేజీ స్థాయిలోనే విద్యార్థులు నైపుణ్యత కలిగి పోటీ పరీక్షలకు సిద్ధపడి చదవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేసి, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని పరిశీలించి గుత్తందారులను పనులు త్వరగా పూర్తి చేయాలని క్వాలిటీలో రాజీ పడకుండా ప్రతి వారం పనుల పురోగతిపై నివేదిక అందించాలని కలెక్టర్ అన్నారు. బీహార్ నుండి వచ్చిన కూలీల చిన్న పిల్లలను చూసి చిన్న పిల్లలను పనుల వద్దకు తీసుకురావద్దని,వారిని దగ్గర్లో ఉన్న అంగన్వాడి సెంటర్ లో చేర్పించాలని ఐసిడిఎస్ సిబ్బందిని ఆదేశించారు. తదుపరి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సైన్స్ విద్యార్థుల క్లాసులోకి వెళ్లి సైన్స్ లో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు మీద క్లాసు తీసుకున్నారు.

వనజ అనే విద్యార్థిని లేపి పారడే మొదటి సూత్రాన్ని చెప్పవలసిందిగా కోరగా విద్యార్థిని సమాధానం చెప్పడం వలన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.తదుపరి కలెక్టర్ విద్యార్థులకు మోటివేషన్ పై క్లాస్ తీసుకొని విద్యార్థులు కష్టపడి చదవాలని, ఏదో ఒక రంగంలో నైపుణ్యత సాధించాలని కష్టపడితే ఫలితం అదే వస్తుందని అందుకుగాను ప్రతి ఒక్కరు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు సిద్ధపడి, పెద్ద పెద్ద గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించాలని, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మంచి స్థానాలలో ఉండాలని, అలా చదువుకోవడం వలనే మేము కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు అయినామని మమ్మల్ని ప్రేరణగా భావించి చదువుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ నాగార్జున రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ గుంటుపల్లి శ్రీనివాస్, కెమిస్ట్రీ లెక్చరర్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read More కామ్రేడ్ పూనం లింగన్న పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేస్తాం..

About The Author