నగరంలో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూలై19: హనుమకొండ నయీమ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గోయాజ్ లగ్జరీ సిల్వర్ జువెలరీ స్టోర్ ను శనివారం ప్రారంభించేందుకు సినీనటి నిధి అగర్వాల్ హాజరయ్యారు. నటి నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.స్టోర్ నిర్వాహకులు గులాబీ పూలను అందించి స్వాగతం పలికారు. అనంతరం అభిమానులు సెల్ఫీలతో ఫోజులిచ్చి ఫోటోలు దిగారు. ముందుగా నటి అగర్వాల్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్ ను ప్రారంభించారు.
అనంతరం అగర్వాల్ మాట్లాడుతూ మన్నీకమైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యూలరీ స్టోర్ సంస్థ వేగంగా విస్తరిస్తుందన్నారు. హన్మకొండ నయంనగర్ లోని షాప్ 13వ స్టోర్ ని ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు. గోయాజ్ స్టోర్ ప్రారంభం నుంచి ఆగస్టు 3 వరకు అద్భుతమైన ఆఫర్లను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పవన్ కళ్యాణ్ తో నటించిన హరహర వీరమల్లు 24న రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్టోర్ నిర్వాహకులు వేములూరి రవిజేజ,ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.