అమరుడా నీమరణం మరువలేనిది,నీ ఆశయాలను సాధిస్తాం

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు

అమరుడా నీమరణం మరువలేనిది,నీ ఆశయాలను సాధిస్తాం

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జులై 19:
 తెలంగాణ సాయుధ పోరాట యోధులు కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంత ఉద్యమ నిర్మాత కామ్రేడ్ దొడ్డ నారాయణరావు మరణం వామపక్షాలకు సీపీఐ కే కాకుండా ప్రజాస్వామ్య వాదులం దరికీ తీరని లోటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం గరిడేపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో దొడ్డ నారాయణరావు సంతాప సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబులకు,నవాబు సైన్యానికి, రజాకార్లకు,దొరలకు, దేశ్ముకులకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని పేద ప్రజల పక్షాన పోరాడిన యోధుడు ఆయనని అన్నారు.

ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న బేతవోలు,లింగగిరి జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి,దొరల ఆదీనం లో వున్న వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన ఘనత నారాయణరావు గారిదని ఆయన అన్నారు. ఆయన 96 సంవత్సరాల వయసులో కూడా నవ యువకుడిలా ఉండి,పార్టీనాయకత్వానికి ఎల్లప్పుడూ మార్గ నిర్దేశం చేస్తూ సూచనలు సలహాలు ఇస్తూఉండేవారని ప్రతి పార్టీ కార్యక్రమం ల్లో పాల్గొనేవారని, వారి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. వారి ఆశయ సాధనకు మనమంతా కంకణబద్దులం కావాలని ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, సహాయ కార్యదర్శి పోటు పూర్ణచంద్రరావు, పోటు కృష్ణబాబు, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కుందూరు వెంకట్ రెడ్డి, మామిడి శీను, తిరగమల్ల కిరణ్, కట్ట అశోక్,బాలశౌరి, పగడాల శీను,సుందరయ్య, మట్టయ్య, పెద్దోజు అనిల్, రామచంద్రు, సాయిలు, నాగయ్య, యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

About The Author