
వేములవాడ :
ఒకినవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న వేములవాడ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు,జూనియర్ ఓపెన్ కుమ్మితే విభాగంలో ఉప్పుల పవన్ రాజ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించారు.ఇటీవల కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సిఎస్ కేఐ ఫౌండర్ ఈ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్ పేర్కొన్నారు.కుమ్మితే విభాగాలలో నాంపల్లి రిశ్విన్ బంగారం, బొడిగె క్రాంతి కుమార్ బి. భవ్యష్,సరస్వతి, సిహెచ్ సూర్య జయచంద్ర,ఎల్.రానా విరాట్, వెండి పతకాలు, సిద్దు,బి.దీవెర్ష్ జి. విగ్నయ్య,జి.వేదనశీ, పి.కార్తీక్, ఎన్.సన్మయ కు కాంస్య పతకాలు సాధించారు.వీరిని ఒకినవా డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కె.వసంత్ కుమార్,కుమార్,సీనియర్ మాస్టర్ లు మొండయ్య,సంపత్ కుమార్, సురభి వేణుగోపాల్,రాజిరెడ్డి, లింగయ్య,లింగయ్య టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఇప్ప శ్రీనివాస్, వేములవాడ ఇన్స్ట్రక్టర్స్ కనకరపు రాజశేఖర్,ఎం.తిరుపతి,లోలోపు రాజు,తదితరులు అభినందించారు.