కుల జనగణన చారిత్రాత్మక విజయం : డీసీసీ బీసీ సెల్ ఛైర్మన్ అంజనేయులుగౌడ్
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి): ఎన్నికల హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరిపిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీ కుల జన గణన చేపట్టి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం చారిత్రక విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత్ జూడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో బీసీ కులగన చేపడతామని ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికార యంత్రంగానికి, ప్రభుత్వానికి బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివేదికను ప్రవేశపెడుతున్న సందర్భంగా కొంతమంది ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడంలేదని, సమగ్ర కుటుంబ సర్వేలో 96% ప్రజలు తమ వివరాలను వెల్లడించడమే ఇందుకు నిదర్శనమన్నారు.ఇప్పటికైనా బిజెపి, బీఆర్ఎస్ నేతలు సమగ్ర కుటుంబ సర్వే కుల గణనపై తమ వైఖరిని మార్చుకొని ప్రభుత్వానికి సహకరించి సలహాలు సూచనలు అందజేయాలని కోరారు. ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆవేశానికి బలికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, రహమత్ హుస్సేన్, ముత్యం, శంకర్, పురం రాజేశం, బొబ్బిలి విక్టర్, ఎస్ ఏ మోసిన్, లింగంపల్లి బాబు, హైమద్ అలీ, పంజాల స్వామి గౌడ్, రోళ్ల సతీష్, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, సిరిపురం నాగప్రసాద్, మెతుకు కాంతయ్య, రామిడి రాజిరెడ్డి, నెల్లి నరేష్, రామిడి తిరుపతి, మాదాసు శ్రీనివాస్, అజయ్, స్వప్న, కుంభాల రాజకుమార్, అనరాసు కుమార్, తోట ఆంజనేయులు, కలీం ముల్కలయోన ఆంజనేయులు, శ్రీనివాస్, తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి):
ఎన్నికల హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరిపిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీ కుల జన గణన చేపట్టి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం చారిత్రక విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత్ జూడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో బీసీ కులగన చేపడతామని ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికార యంత్రంగానికి, ప్రభుత్వానికి బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివేదికను ప్రవేశపెడుతున్న సందర్భంగా కొంతమంది ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడంలేదని, సమగ్ర కుటుంబ సర్వేలో 96% ప్రజలు తమ వివరాలను వెల్లడించడమే ఇందుకు నిదర్శనమన్నారు.ఇప్పటికైనా బిజెపి, బీఆర్ఎస్ నేతలు సమగ్ర కుటుంబ సర్వే కుల గణనపై తమ వైఖరిని మార్చుకొని ప్రభుత్వానికి సహకరించి సలహాలు సూచనలు అందజేయాలని కోరారు. ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆవేశానికి బలికాక తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, రహమత్ హుస్సేన్, ముత్యం, శంకర్, పురం రాజేశం, బొబ్బిలి విక్టర్, ఎస్ ఏ మోసిన్, లింగంపల్లి బాబు, హైమద్ అలీ, పంజాల స్వామి గౌడ్, రోళ్ల సతీష్, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, సిరిపురం నాగప్రసాద్, మెతుకు కాంతయ్య, రామిడి రాజిరెడ్డి, నెల్లి నరేష్, రామిడి తిరుపతి, మాదాసు శ్రీనివాస్, అజయ్, స్వప్న, కుంభాల రాజకుమార్, అనరాసు కుమార్, తోట ఆంజనేయులు, కలీం ముల్కలయోన ఆంజనేయులు, శ్రీనివాస్, తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
