
వేములవాడ :
హైదరాబాద్ వాస్తవ్యులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, మాలతి దంపతులు బుధవారం కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) విరాళం అందజేశారు.ఆలయ పర్యవేక్షకులు సంజీవ్ కుమార్ కి ఈ విరాళాన్ని అందజేశారు. వారి వెంట సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ తదితరులు పాల్గొన్నారు.