రైతులు కాళ్లు మొక్కే దుస్థితి కాంగ్రెస్ పాలనలోనే

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్

గుమ్మడిదల : 

WhatsApp Image 2025-08-21 at 6.14.59 PM

రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి కాంగ్రెస్ పాలనలోనే రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బిఆర్ఎస్ నేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో విలేకరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షంలో చెప్పులను లైన్‌లో ఉంచి గంటల తరబడి నిలబడినా కూడా యూరియా అందక రైతులు బాధపడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి రావడం రాష్ట్రానికి సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు యూరియా అందించే ప్రత్యేక చర్యలు చేపట్టాలని, లేకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో దేవేందర్ రెడ్డి, సదానంద రెడ్డి, సత్యనారాయణ, స్టార్ సంజీవరెడ్డి, సుధాకర్ రెడ్డి,సూర్యనారాయణ,శ్రీనివాస్ రెడ్డి , జయపాల్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, శివ, రమేష్, పాల్గొన్నారు. 

Read More రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రాజ్యమేలుతున్న అవినీతి..

About The Author