ప్రజలకి అందుబాటులో శ్రీనివాస సూపర్ మార్కెట్

వేములవాడలో సూపర్ మార్కెట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది

ప్రజలకి అందుబాటులో శ్రీనివాస సూపర్ మార్కెట్
వేములవాడ, ఆగస్టు 18 (భారత శక్తి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ వేములవాడ పట్టణంలోని (మల్లారం రోడ్ చౌరస్తా) ఆవరణలో శ్రీనివాస సూపర్ మార్కెట్ రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవం కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అది పెద్ద బ్రాంచ్ "శ్రీనివాస సూపర్‌ మార్కెట్‌" రెండవ బ్రాంచ్ వేములవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందని, మేనేజింగ్ డైరెక్టర్ తాటిపెల్లి శ్రీనివాస్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
అనంతరం సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుండి వేములవాడ పట్టణంలో ప్రారంభించిన శ్రీనివాస్ సూపర్ మార్కెట్ పట్టణంలో ప్రజలందరికి అందుబాటులో ఉంచి తక్కువ ధరలకు సరుకులు అందిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తు వారి మన్నలు పొందుతూ "శ్రీనివాస సూపర్ మార్కెట్" ఒక బ్రాండ్‌గా నిలిచిందని,ఇప్పుడు వేములవాడలో "శ్రీనివాస సూపర్ మార్కెట్" రెండో బ్రాంచ్ ప్రారంభించి వినియోగదారులకు హోల్సేల్ ధరలోనే సరుకులు అందిస్తున్నామని అన్నారు.ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు,వివిధ పార్టీ రాజకీయ నాయకులు, పాత్రికేయులు,పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

About The Author