ఏసీబీ వలలో చిక్కిన ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్టర్ శ్రీనివాస రెడ్డి...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ ముద్దాసిర్ గిఫ్ట్ డిడ్ కోసం బాధితుడి నుండి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, అధికారులు శుక్రవారం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్: 1064
వాట్సప్ నెంబర్ 9440446106
ఎక్స్ ట్విటర్ Telangana ACB
(Twitter): @TelanganaACB
వెబ్సైట్ acb.telangana.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.. ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలను గోప్యంగా ఉంచబడుతాయి. అని అన్నారు.