వర్షాలు కురుస్తే మా ఇంట్లోకి నీళ్లు వస్తుండే..
గత 30 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక చాలా అవస్థలు పడ్డాం.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఆగస్టు 18:
వర్షాలు కురుస్తే మా ఇంట్లోకి నీళ్లు వస్తుండే, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మదన్ అన్న వల్ల మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని ఇందిరమ్మ ఇంటి పధకం లబ్ధిదారులు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, ఎండ్రియాల్, భ్రాహ్మణపల్లి, దేవాయిపల్లి, దేమే, సంగోజీవాడి గ్రామాల్లో భారీ వర్షాలు పడుతున్నా వెనక్కి తగ్గకుండా, స్వయంగా ఎం పి డి ఒ, ఎ,ఇ లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి వారి ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తూ, ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణమే పరిష్కరించడం ఆయన సేవాభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని, లబ్ధిదారులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక చాలా అవస్థలు పడ్డామని అన్నారు. ఎమ్మెల్యే చొరవతో మాకు ఇందిర్మమ్మ ఇల్లు మంజురు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సొంత ఇంటి కల నెరవేరబోతోందని అన్నారు. బిల్లు కుడా నేరుగా మా బ్యాంకు ఖాతాలో జమ కావడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్, పేదోడు తన ఇంట్లోకి గృహప్రవేశం చేసిన రోజు నాకు నిజమైన విజయం లభించినట్లే, అంటూ భావోద్వేగంగా చెప్పారు. గ్రామాల్లో ఇందిరమ్మ కాలనీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఇటీవలిలో గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ ని కలిసి, నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అభ్యర్థించారన్న విషయాన్ని కూడా తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవాలని లక్ష్యంగా మదన్ మోహన్ గ్రామగ్రామాన ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నారు. అభివృద్ధిలో ఎల్లారెడ్డిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజా సంక్షేమ మార్గంలో ఆయన చేస్తున్న ఈ ముందడుగు,ప్రభుత్వం,ప్రజల మధ్య దృఢమైన నమ్మకాన్ని ఏర్పరుస్తోందని తెలిపారు.