సైబర్ మోసాలకు గురై పోగొట్టుకున్న నగదు బాధితులకు రీఫండ్ చేసే వరకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలి

పోలీస్ అధికారులను ఆదేశించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం ప్రతినిది : 

WhatsApp Image 2025-08-20 at 6.47.04 PM

సైబర్ నేరాలలో బ్యాంక్ ఖాతాలో స్తంభింపజేసిన నగదు ప్రాసెస్ ప్రకారం తిరిగి భాదితులకు రిఫండ్ చేయడంలో తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫిరెన్ ద్వారా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

Read More డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే  "గోల్డెన్ అవర్" లో సైబర్ మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని అన్నారు. నేరాన్ని సైబర్ సెక్యూరిటీ వెంటనే నివేదించడం వల్ల నిందితుడి బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లలో కాజేసిన సొమ్ము మొత్తాన్ని స్తంభింపజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు, తద్వారా బాధితులకు రీఫండ్లను సులభతరం చేస్తుందని అన్నారు. 

Read More ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

పౌరులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగించే సైబర్ నేరాల నేపథ్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు మొదలు బాధితులకు రీఫండ్లు చేయడంలో సులభతరం అయిన నేపథ్యంలో సైబర్ నేరలకు గురైన బాధితులు 1930 కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.in పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.

Read More బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

అదేవిదంగా అపరిచితులు/సంస్థలతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. విభిన్న ఖాతాలకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి, వాటిని తరచుగా మార్చుకోవాలని, దుష్పరిమాణాల నుండి రక్షించుకోవడానికి మీ సాఫ్ట్‌వేర్ మరియు భద్రతా వ్యవస్థలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ సైబర్ క్రైమ్ ఫణ్ణిందర్, సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు, సిఐ స్వామి ఎస్సై విజయకుమార్ పాల్గొన్నారు.

Read More నేటి భారతం :

 

Read More కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పిప్పాల రాజేందర్

About The Author