హెచ్‌ఎమ్‌డిఎతో అభివృద్ధి శూన్యం..

అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్న దౌర్భాగ్యం...

  • అనుమతుల రూపంలో వసూళ్ల కేంద్రం ఏర్పాటు.. 
  • అత్యంత దారుణంగా గ్రీన్ బెల్ట్ ల దోపిడీ.. 
  • పారదర్శకత కరువైన టెండర్ల ప్రక్రియ.. 
  • గాలికొదిలేసిన ప్రజల సమస్యలు..  
  • లంచాల మత్తులో జోగుతున్న అధికారగణం.. 
  • డబ్బులు పడేస్తే విచ్చల విడిగా అనుమతులు.. 
  • ప్రభుత్వ భూములపైనా కొరవడిన నియంత్రణ.. 
  • ఏకంగా హెచ్.ఎం.డీ.ఏ. కమిషనర్ పైనే అవినీతి ఆరోపణలు.. !
  • అంతర్జాతీయ ప్రమాణాల మాట పక్కనబెడుతున్నారు.. 
  • నగర చుట్టుపక్కల భూములు అన్యాక్రాంతం చేస్తున్నారు.. 
  • బిల్డర్లతో చేతులు కలిపి అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారు.. 
  • హెచ్.ఎం.డీ.ఏ. ను గాడిలో పెట్టడానికి సమరశంఖం పూరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరెప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పడిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పుడు విమర్శల తుపానులో చిక్కుకుంది. నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల విస్తరణ వంటి బాధ్యతలు భుజాన వేసుకున్న ఈ సంస్థ, ప్రస్తుతం అవినీతి, అక్రమాల కేంద్రంగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదెంతమాత్రం క్షమార్హం కాదు.. ఒక ప్రత్యేక సంస్థను ప్రభుత్వం ఏర్పరచినప్పుడు.. ఆ సంస్థ భుజస్కందాలపైన అంతులేని బాధ్యత ఉంటుంది.. అలాంటి సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎంతో ఉన్నతంగా పనిచేయాల్సి ఉంటుంది.. పాలించే ప్రభుత్వాలైనా, పాలింపబడుతున్న ప్రజలైనా ఇలాంటి సంస్థలను గొప్పగా ఊహించుకుంటారు.. గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు.. అలాంటి నమ్మకాలను వమ్ముచేస్తూ..  కొందరు అధికారులు అవినీతి బాట పట్టడంతో హెచ్.ఎం.డీ.ఏ. లాంటి సంస్థలు అధోగతి పాలవుతున్నాయి.. అవినీతికి ఆలవాలమై పోతున్నాయి..  ప్రభుత్వ, ప్రజల ఆస్థులను రక్షించాల్సిన వారే అడ్డదారిలో గడ్డి కరుస్తూ.. నీతి నియమాలను పక్కనబెడుతూ..  వ్యవస్థ అనే పదానికి మాయని మచ్చను తెచ్చిపెడుతున్నారు.. అవినీతి కూపంలో కూరుకుపోయిన హెచ్.ఎం.డీ.ఏ. సంస్థ వ్యవహారంపై  "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ" అందిస్తున్న వాస్తవ కథనం మీకోసం..

Hyderabad-master-plan-2031-FB-1200x700-compressed

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ :
అనుమతుల ప్రక్రియను వసూళ్ల కేంద్రంగా మార్చుకున్న హెచ్.ఎం.డీ.ఏ. చరిత్ర మసకబారిపోతోంది.. హెచ్.ఎం.డీ.ఏ. పరిధిలో చిన్న లే అవుట్ అనుమతి నుంచి భారీ స్థాయి ఆకాశహర్మ్యాలైన పెద్ద పెద్ద భవనాల వరకు అనుమతులు పొందడం అంత సులభం కాదు. ప్రతి ఫైల్ కూడా ముందుకు కదలాలంటే, లంచాల పర్వం తప్పనిసరి అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సాధారణ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటే, కొంత “వసూళ్లు” జరిగాక మాత్రం వెంటనే ఆమోదం పొందుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

Read More దోప దీప నైవేద్య సమావేశం..

విపరీతంగా పెరిగిపోయిన గ్రీన్ బెల్ట్‌ల దోపిడి :
నగరానికి ఊపిరితిత్తుల్లా ఉండే గ్రీన్ బెల్ట్ ప్రాంతాలు కూడా అక్రమ నిర్మాణాలకు బలవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వడంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రకృతి పరిరక్షణ అనే పేరే మిగిలిపోయి, ప్రాక్టికల్‌గా అవినీతికి వేదికైపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read More బీసీల దీక్షను విజయవంతం చేయాలి

పారదర్శకత కరువైన టెండర్ల ప్రక్రియ : 
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్లు, అభివృద్ధి పనులు అన్నీ టెండర్ల ద్వారానే కేటాయించబడుతున్నాయి. అయితే ఈ టెండర్ల కేటాయింపులోనూ పారదర్శకత లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. బినామీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడం, అధిక ధరలతో పనులు కేటాయించడం, పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించడం వంటి ఆరోపణలు తరచూ వెల్లువెత్తుతున్నాయి.. 

Read More వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫోటో కాంపిటేషన్ విజేతలకు బహుమతులు

ప్రజల సమస్యలు గాలికొదిలేసిన అధికారులు :
హెచ్.ఎం.డీ.ఏ.లో సాధారణ పౌరుడి పని సజావుగా జరగడం చాలా కష్టం. చిన్న స్థలానికి లే అవుట్ అనుమతి తీసుకోవాలన్నా, రోడ్డు విస్తరణ పరిధిలో భూమికి పరిహారం పొందాలన్నా, ఎప్పటికప్పుడు లంచం చెల్లించాల్సిన ఆధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. తిరి ప్రశ్నించే పరిస్థితి లేదని బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. దీంతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read More హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు విద్యార్థుల ఎంపిక

ఇక చివరగా చెప్పుకోవలసింది :
“హైదరాబాద్ అభివృద్ధి” అనే లక్ష్యంతో ఏర్పడిన హెచ్.ఎం.డీ.ఏ. ఇప్పుడు అభివృద్ధి కన్నా అవినీతి కేంద్రంగా మారిపోయిందనే వాస్తవం నగర ప్రజల ఆవేదనగా మారింది. పారదర్శకత, సమర్థత, నైతిక విలువలు లేకుండా పనిచేస్తే, ఈ సంస్థపై నమ్మకం కోల్పోవడం సహజమే. కాబట్టి హెచ్‌.ఎమ్‌.డి.ఎలో శుద్ధి అవసరం అనేది అత్యవసరం అనే అభిప్రాయం పౌర సమాజం నుండి వినిపిస్తోంది. హెచ్‌.ఎమ్‌.డి.ఎ. అవినీతి పాలనకు ప్రతీక.. అనే భావం నుంచి ప్రజలు బైట పడాలంటే  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరు వినగానే ప్రజలకు “అభివృద్ధి” అనే ఆశ కలగాలి. కానీ నేటి పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ఈ సంస్థలో అవినీతి ఇంతలా పాతుకుపోయింది..  పర్యావరనాన్ని సైతం అమ్మకానికి పెట్టిన దారుణ పరిస్థితులు మారాలి.. 

Read More హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి.. 

నగరానికి ఊపిరితిత్తులైన గ్రీన్ బెల్ట్ ప్రాంతాలు కూడా కబ్జాదారుల చేతిలో బలి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.. ఈ అధికారుల దురాశ వల్ల హైదరాబాద్ వాతావరణం వేడెక్కుతోంది. రాబోయే తరాలకు ఆక్సిజన్ బదులు కాంక్రీటే మిగలబోతోందనే నిజాన్ని గ్రహించాలి.. ఇక  కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు పారదర్శకంగా కేటాయించాల్సింది పోయి, బినామీ  కంపెనీలకు బహుమతుల్లా ఇచ్చే పద్ధతి మానుకోవాలి.. పనుల నాణ్యతను పక్కన పెట్టి, కమీషన్లే ప్రధానంగా మారుతున్న ప్రక్రియలు మార్పు చెందాలి.. రోడ్ల నిర్మాణం జరగకముందే బిల్లులు క్లియర్ కావడం, ఫ్లైఓవర్లు నిర్మించకముందే ఖాతాలు ఖాళీ కావడం హెచ్.ఎం.డీ.ఏ. లో పరిపాటిగా మార్పియింది.. 

Read More రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలి..

ప్రజలను బానిసలుగా కాకుండా పన్నులు కట్టే అతిథులుగా చూడాలి.. ఒక సాధారణ పౌరుడు హెచ్.ఎం.డీ.ఏ. ఆఫీసుకు వెళ్ళడం అంటే అవినీతి వలలో చిక్కుకోవడమే అన్న భయాందోళనల నుంచి బయటపడగాలి.. డబ్బు లేకపోతే పనిజరగదు.. అన్నది వాస్తవం.. ప్రజలు తమ కష్టార్జిత ధనాన్ని అధికారుల కడుపు నింపడానికి ఖర్చుపెట్టాల్సిన దుర్భర పరిస్థితి సిగ్గుచేటు. ఈ జాడ్యానికి చరమగీతం పాడటానికి  "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ" శతథా ప్రయత్నిస్తోంది.. మా ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం ఆశిస్తోంది..

Read More కేటీఆర్ భాష మార్చుకో...

About The Author