బీసీల దీక్షను విజయవంతం చేయాలి
జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్
ములుగు జిల్లా :
బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో చేపడుతున్న బీసీల సత్యాగ్రహ దీక్షను వెనుకబడిన తరగతుల ప్రజలు హాజరై మన హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీల జాతీయ సంఘం ములుగు జిల్లా యూత్ అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని, బీసీలంతా ఐక్యతతో ఒక్క గళమై గర్జిస్తే మన హక్కులు మనం సాధించుకోవచ్చని అన్నారు.ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో నిర్వహించే బీసీల సత్యాగ్రహ దీక్కు చీమలదండులా కదిలి రావాలని శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు.