నాణ్యత, నమ్మకమే వ్యాపార అభివృద్ధికి మూలం
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)ఆగష్టు18:
సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకులు జిఎన్ఆర్ సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ, భీమవరంలో గుండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన జిఎన్ఆర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమారం, హసన్పర్తి చుట్టుపక్కల ప్రజలకు నాణ్యమైన నిత్యవసర సరుకులు, అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చిన జిఎన్ఆర్ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
60 సంవత్సరాలుగా జిఎన్ఆర్ యాజమాన్యం నగరంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందారని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం మార్కెట్లలో కార్పొరేట్ స్టోర్స్ లు విచ్చలవిడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిఎన్ఆర్ యాజమాన్యం పేద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యవసర సరుకులు ఇతర వస్తువుల అమ్మకాలు ఎన్నో సంవత్సరాల నుండి నిత్యవసర సరుకులు విక్రయించే వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు పొందారని తెలిపారు. వివిధ కంపెనీల పేరుతో నెలకొల్పబడ్డ రిలయన్స్, మోర్ వంటి స్టోర్స్ లలో విక్రయించే నిత్యవసర సరుకులు, ఇతర వస్తువుల కంటే జి ఎన్ ఆర్ సూపర్ మార్కెట్లో ప్రతి సామాన్య మానవుడికి ఆరోగ్యంవంతమైన, నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకులు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో లభిస్తాయని తెలిపారు.
అనంతరం గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ భీమారంలో రెండవ బ్రాంచ్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా జిఎన్ఆర్ పేరుతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను సమిష్టిగా కొనసాగిస్తున్నామని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని స్టోర్స్ ను ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ జిఎన్ఆర్ సూపర్ మార్కెట్ చైర్మన్ తండ్రి గుండా కృష్ణమూర్తి, సోదరుడు గుండా నాగేశ్వరరావు, కుమారులు చైతన్య, పృథ్వీరాజ్, 55 డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత శ్రీనివాసులు, నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, వ్యాపారవేత్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.