దేవాలయ భూమిని లీజు రద్దు చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం
కరీంనగర్ ప్రతినిధి, ఆగస్టు 18(భారత శక్తి):
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సచ్చిదానంద ఆశ్రమం రామయాలానికి సంబంధించిన ప్రభుత్వ భూమి ప్రైవేటు విద్యాసంస్థలకు తొవ్వ 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చినారు. ఇట్టి భూమిని ప్రైవేటు వ్యక్తులే ప్రైవేట్ విద్యాసంస్థలకు లీజుకు ఇచ్చినారు .దేవాలయ భూమిని ప్రైవేటు విద్యాసంస్థలకు తొవ్వ పోవుటకు స్థలం లీజుకు ఇచ్చిన దానిని రద్దుచేసి పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు లేదా దేవాలయానికి ఉపయోగించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సందర్బంగా సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పిర్యాదు చేసారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు చేస్తామని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కవంపల్లి అజయ్, ఉపాధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు ,తదితరులు పాల్గొన్నారు.