ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయం.. : ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ :
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన.
300 మందికి పైగా వైద్య పరీక్షలు.
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రెస్ క్లబ్–మెడికవర్ సంయుక్త ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లోని మహా లింగేశ్వర గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. సుమారు ఈ వైద్య శిబిరంలో 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది, టీయూడబ్ల్యూజే హెచ్–143 వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ తెలిపారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఏఎంసి చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాలింగేశ్వర గార్డెన్‌లో జరిగిన ఈ శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనీష్ పబ్బ (కార్డియాలజిస్ట్), డాక్టర్ లోకేష్ (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ రాకేష్ (ఆర్థోపెడిక్ సర్జన్) వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా బిపి, షుగర్, ఈసీజీ, టూడీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వారిని మెడికవార్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా సామాజిక సేవ దృక్పథంతో ప్రజలకు ఉచితంగా కార్పో వైద్య సేవలు అందింస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉచిత వైద్య శిబిరం పేద మధ్యతరగతి వారికి ఉపయోగపడేలా పరీక్షలు నిర్వహించడం వారి సేవా భావానికి అభినందనీయమని ఆయన కొనియాడారు.గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించాలని మెడికవర్ వైద్య సిబ్బంది నిర్వాహకులకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. వైద్యపరంగా పేదలకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.పేద, మధ్య తరగతి వారు ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం,అజాగ్రత్తగా వ్యవహరిస్తారని,వారికి అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని కృషిచేసిన ప్రెస్ క్లబ్- మెడికవర్ ఆసుపత్రి వారిని అభినందించారు.అనంతరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ నియోజకవర్గ, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఖర్చులతో లభించే వైద్య పరీక్షలు ఇక్కడ ఉచితంగా అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగిందని మహమ్మద్ రఫీక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ కరీంనగర్ మార్కెటింగ్ హెడ్ శ్రీకాంత్,లక్ష్మీనారాయణ, మెడికవర్ వైద్య సిబ్బంది, ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నరసయ్య,ప్రధాన కార్యదర్శి అయాచితుల జితేందర్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అలీ, కొత్వాల్ శ్రీనివాస్,కోశాధికారి కమలాకర్, సంఘ సభ్యులు ఓరగంటి విష్ణు, దేవరాజు, వేణు, హరీష్ ,ప్రవీణ్ కుమార్, సంతోష్ , పంపరి నాగరాజు, సంటి రాజేందర్ లతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.