వేములవాడ పార్థసారథి నర్సింగ్ హోమ్ లో అరుదైన శస్త్రచికిత్స
పిత్తాశయం నుంచి 131రాళ్లు తొలగింపు
వేములవాడ :
వేములవాడ పట్టణంలోని పార్థసారథి నర్సింగ్ హోమ్‌లో వైద్యులు అరుదైన శాస్త్ర చికిత్స చేశారు. ఓ మహిళ పిత్తాశయం నుంచి ఏకంగా 131 రాళ్ళను తొలగించారు. కడుపునొప్పి, వాంతుల వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా రోగికి కష్టతరమైన సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు డాక్టర్ పద్మలత.వివరాల్లోకెళ్తే...వేములవాడ పట్టణానికి చెందిన ఓ మహిళ కడుపునొప్పి,గ్యాస్ ఉబ్బరం వాంతుల వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్యులను ఆశ్రయించగా,ఆమె పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తేలింది.శుక్రవారం పట్టణంలోని స్థానిక పార్థసారథి నర్సింగ్ హోమ్‌లో లాపరోస్కోపి పద్ధతిలో ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇందులో గాల్ బ్లాడర్ తొలగించగా 131 రాళ్లు బయటపడ్డాయని గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మలత వెల్లడించారు.ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మలత మాట్లాడుతూ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు అధికబరువు, వ్యాయామం చేయకపోవడం, తగిన ఆహారపు అలవాట్లు లేకపోవడం,మొదట్లో కడుపు నొప్పి,వాంతులు,జీర్ణకోశ సమస్యలతో ప్రారంభమై మెల్లగా తీవ్రరూపం దాల్చుతుందని సమయానికి గుర్తించకపోతే ప్రమాదం పెరుగుతుందని అన్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడాలన్నారు. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించాలని,పౌష్టికాహారం తీసుకోవాలని ,కడుపునొప్పి, జీర్ణకోశ సమస్యలు వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.