వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫోటో కాంపిటేషన్ విజేతలకు బహుమతులు

whatsapp-image-2025-08-20-at-5.59.14-pm

ఉమ్మడి వరంగల్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్టాఫ్ ఫోటో జర్నలిస్టులకు నిర్వహించిన ఫోటో కాంటెస్ట్ విజేతలను న్యాయనిర్ణేతలు ప్రకటించారు.  కేయూ జర్నలిజం విభాగధిపతి సంగాని మల్లేశ్వర్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాదె లింగమూర్తి, కేయూ పూర్వ పీఆర్వో వేదాంతం కృష్ణమాచారిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి కాంటెస్ట్ కు వచ్చిన ఫొటోలను వడబోసి ఎంపిక చేశారు. ప్రతీ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించారు. కోడ్ నేమ్ ద్వారా ఫోటోలను ఎంపిక చేసిన తర్వాత పేర్లను ప్రకటించారు.

Read More సివిల్ డిపార్ట్మెంట్ లో వసూళ్ల దందా.

ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో “జీవనవైవిద్యం” కాప్షన్ ఫోటోకు సాక్షి దినపత్రిక స్టాఫ్ ఫొటో గ్రాఫర్ పెద్దపల్లి వరప్రసాద్ కు ప్రధమ బహుమతి గెలుపొందారు. “ఆపత్కాలం” కాప్షన్ ఫోటోకు గాను ఎతెమాద్ దినపత్రిక ఫోటోగ్రాఫర్, షర్ఫొద్దిన్ మాషూక్ కు ద్వితీయ బహుమతి, “ఆసరాసంబురం” ఫొటోకాప్షన్ ఫోటోకు గాను నమస్తే తెలంగాణ దినపత్రిక ఫొటోగ్రాఫర్ , మేరుగు ప్రతాప్ లు తృతీయ బహుమతులు గెలుపొందారు. 
 
1. గోవర్థనం వేణుగోపాల్, సాక్షి, 2. సంపెట సుధాకర్, ఆంధ్రజ్యోతి. 3. పాలకుర్తి మధు, ఆంధ్రజ్యోతి.. 4. వీరగోని హరీష్, ఆంధ్రజ్యోతి. 5. ఆవుల సంపత్, ఈనాడు.. లకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. ఇప్పటివరకు వరంగల్ లో ఫోటో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఎవరూ కాంపిటీషన్ పెట్టలేదని  తమ కమిటీ ఫోటో జర్నలిస్టుల కోసం ఆలోచించి వారిని గౌరవించటం సముచితమని బావించి ఈ పని చేసిందని అన్నారు.

Read More వేధుమా డిజైన్ హౌస్ – మీ కలల ఇంటికి నమ్మకమైన డిజైన్..

ఉత్తమ న్యూస్ పిక్చర్ కు ప్రథమ బహుమతి కింద 10 వేల రూపాయల నగదు బహుమతి, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రము ద్వితీయ బహుమతి కి 5,000/-, తృతీయ బహుమతికి 3,000/- నగదు బహుమతులతో పాటుగా కన్సోలేషన్ బహుమతి కింద ఒక్కొక్కరికి 1000/- చెప్పిన నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రము అందజేయడం జరుగుతుందని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, బోల్ల అమర్ లు తెలిపారు.

Read More ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

10:30 గంటలకు ప్రెస్ క్లబ్ లో “ ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన “ఫోటో కాంపిటీషన్” విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించనున్నామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా శాసన మండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య లు హజరౌతారని  గౌరవ సభ్యులు హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. ముఖ్య అథిధుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రధానం జరుగుతుందని అన్నారు.

Read More ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి..

About The Author