ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలి ....

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం ప్రతినిది : 

ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ప్రైవేట్ ఆసుపత్రులలో ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి
ఆరోగ్య శ్రీ, సీఎం రిలిఫ్ ఫండ్ లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఆసుపత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

WhatsApp Image 2025-08-20 at 6.50.58 PM

హెచ్.ఎం.ఎస్, వైద్య ఖర్చుల నియంత్రణ, పి.సి.పి.ఎన్.డి.టి, ఇతర యాక్ట్ లపై  ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 

Read More ఏసీబీ వలలో చిక్కిన ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్టర్ శ్రీనివాస రెడ్డి...

జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ లకు బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రాజ్యమేలుతున్న అవినీతి..

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వైద్య రంగానికి సంబంధించి చట్టాల పట్ల ప్రైవేట్ ఆసుపత్రుల వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్.ఎం. ఎస్.), వైద్య ఖర్చుల నియంత్రణ, పిసి పి.ఎన్.డి.టి., క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఎంటిపీ యాక్ట్, ఐ.వి.ఎఫ్. సరోగసి నియమాలు పాటిస్తూ నాణ్యమైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో సంబంధిత చట్టాలపై ట్రైనర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. 

Read More రైతులు కాళ్లు మొక్కే దుస్థితి కాంగ్రెస్ పాలనలోనే

మన వాహనాలకు ఏ విధంగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ తీసుకుంటామో, అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తప్పనిసరిగా వంద శాతం క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ క్రింద రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు పాటించాల్సిన నిబంధనలు ప్రభుత్వం నిర్ణయిస్తుందని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలని అన్నారు. నిరుపేదలకు ఎంపానెల్మెంట్ ఆసుపత్రులలో 10 లక్షల రూపాయల చికిత్స అందించాలని ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తుందని, ఈ పథకం పట్ల అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Read More 497 కోట్లతో పాలేరు నియోజకవర్గ పరిధిలో విద్యా శాఖ ఇన్ ఫ్రా అభివృద్ధికి చర్యలు...

ఒకే చికిత్సకు సీఎం రిలిఫ్ ఫండ్, ఆరోగ్య శ్రీ రెండు చోట్ల క్లెయిమ్స్ చేస్తున్నారని, ఈ పద్దతి మారాలని అన్నారు. ఐ.వి.ఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణలో నిబంధనలు పాటించాలని అన్నారు. హైదరాబాద్ కేసులో టెస్ట్ ట్యూబ్ బేబి నుంచి మానవ రవాణా వరకు తప్పులు జరిగాయని, అటువంటివి నివారించేందుకు మనం నిబంధనలు పాటించాలని అన్నారు.  ఫర్టిలిటి సెంటర్, ఐ.వి.ఎఫ్. క్లినిక్, జెనెటిక్ కౌన్సిలింగ్, నర్సింగ్ హోమ్, డయాగ్నొస్టిక్, స్పీచ్ థెరపీ వంటి అనేక రకాల ఆసుపత్రులు వస్తున్నాయని, వీరందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. స్పీచ్ థెరపీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్కడ క్వాలిఫైడ్ వైద్యులు ఉన్నారా వంటి అంశాలు పరిశీలన చాలా అవసరమని అన్నారు.  ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం, అగ్ని ప్రమాదాల నివారణకు వాహనాలు వచ్చేలా ఫైర్ క్లియరెన్స్ ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లో అగ్ని ప్రమాదం కారణంగా ఒక ఇంట్లో మూడు తరాలకు చెందిన ప్రజలు మరణించారని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని, ఇందులో ఎటువంటి సడలింపు ఇవ్వడం కుదరదని కలెక్టర్ స్పష్టం చేశారు.  డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు, టీబీ నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు తమ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఆరోగ్యకరమైన ఖమ్మం జిల్లాను తయారు చేయడంలో ప్రైవేట్ ఆసుపత్రులు తమ సహకారం అందించాలని అన్నారు. 

Read More ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి..

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పి.సి.పి.ఎన్.డి.టి, ఇతర చట్టాలపై  సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.  

Read More రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలి..

ఐ.ఎం.ఏ. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కంభంపాటి నారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుపై హై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిని మున్సిపాలిటీ లలో అమలు అయ్యేలా చూడాలని అన్నారు. చిన్న ఆసుపత్రులకు ఫైర్ సేఫ్టీ అంశంలో కొంత సడలింపు ఇవ్వాలని అన్నారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణ పట్ల ప్రైవేట్ వైద్యులు అందించిన సూచనలు, సలహాలను కలెక్టర్ తెలుసుకున్నారు. 

Read More హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు విద్యార్థుల ఎంపిక

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. బి. కళావతి బాయి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. చందు నాయక్, డా. వెంకట రమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ., స్టేట్ టి.ఓ.టి. లు డా. కల్పన తోరన్, ఎస్.ఎం.ఓ. డా. మురారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ నారాయణ మూర్తి, ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలాజిస్టులు, రేడియోలజిస్టులు, డాక్టర్లు, హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్లు, డెమో సుబ్రహ్మణ్యం, స్థాటస్టికల్ ఆఫీసర్ నవీన్ కుమార్, డిపిఎం. దుర్గ, హెల్త్ ఎడుకేటర్ అన్వర్, డిడిఎం. నాగరాజు, డిఎస్ఓ వేణు, సంబంధిత అధికారులు,  తదితరులు  పాల్గోన్నారు.

Read More కేటీఆర్ భాష మార్చుకో...

About The Author