
కరీంనగర్ : కేటీఆర్ భాష థర్డ్ క్లాస్ కి మారిపోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనీ, తెలంగాణ బిడ్డ గా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి, పేద గ్రామీణ వ్యవసాయం కుటుంబం నుండి వచ్చి హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జి గా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారనీ, నాయకోవిధుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షించబడుతుందనీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిను ఎంపిక చేసిందన్నారు. గోడ మీద ఉన్న బి ఆర్ ఎస్ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలన్నారు. బీజేపీ వెంట వెళ్తారా...? తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి గా ఇండియా కూటమి వెంట వస్తారా వారి విజ్ఞత కి వదిలేస్తున్నామన్నారు. మీకు బీజేపీ తో ఉన్న అవగాహన కాంగ్రెస్ పార్టీని ఇలాగే తిడతారా ఎన్డీఎ అభ్యర్థికి ఓటేస్తారో 9వ తేది తెలుస్తుందన్నారు.
యూరియా ఎవరు ఇస్తే వారికి ఓటు వేస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఆయనకు యూరియా ఎవరు ఇస్తారో సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూరియా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందనీ, తెలంగాణ కి వివక్ష పూరితంగా ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వాన్ని బదనం చేయాలని చేస్తున్నారనీ ఆరోపించారు. తెలంగాణ లో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు,సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు పంపిణీ, సన్న వడ్లకు 500 బోనస్ ,60 వేల ఉద్యోగాలు ,9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ,60 వేల ఉద్యోగాలు,గురుకుల మెస్ చార్జీలు పెంచాం,అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసి ఓర్వలేకే బధనం చేసే కుట్ర జరుగుతుందనీ చెప్పారు.
బి ఆర్ ఎస్ నాయకులు రైతులను భయబ్రాంతులకు గురి చేస్తు, రాక్షసానందం పొందుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనీ చెప్పారు. ఆంధ్రపదేశ్ కి అధిక నిధులు ఇస్తే తెలంగాణ కు అన్యాయం జరిగితే బి ఆర్ ఎస్ తాన తందాన అంటుందనీ, తెలంగాణ కు అన్యాయం జరిగీతే మన కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదనీ, మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఎవరు లేకున్న చెప్పులు లైన్ లో పెట్టీ బధనం చేయాలని చూస్తు, రాక్షసానందం పొందుతున్నారాని ఆగ్రహం వ్యక్తం చేశారు..